యూజర్లను ఆకట్టుకునేందుకు మొబైల్ కంపెనీలు సరికొత్త ఫీచర్స్‌తో కొత్త మోడల్స్‌ను మార్కెట్లలోకి లాంచ్ చేస్తుంటాయి. పోకో, రియల్మీ, మోటరోలా, ఒప్పో, వివో సహా పలు కంపెనీలు వివిధ ప్రైస్ సెగ్మెంట్లలో ఈ నెలలో తమ స్మార్ట్ఫోన్లను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి, ఆ స్మార్ట్ ఫోన్ల జాబితాను పరిశీలిద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
పోకో ఎఫ్4 జీటీ
ఈ నెలలో విడుదలయ్యే ప్రధాన స్మార్ట్ఫోన్లలో ఇది ఒకటి. ఫుల్-HD+ స్క్రీన్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల AMOLED డిస్ప్లేతో లాంచ్ కానుంది. అదనంగా, డిస్ప్లే గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటక్షన్ పొందనుంది. 12GB ర్యామ్ / 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. సెల్ వెనుక భాగంలో 64MP సోనీ IMX686 ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 8MP మాక్రో లెన్స్‌తో కూడిన ట్రిపుల్-కెమెరా సెటప్ ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్ల కోసం ముందు భాగంలో 20MP Sony IMX596 స్నాపర్‌ను అమర్చారు. దీని ధర $533 (రూ. 41,000) కంటే తక్కువగా ఉండవచ్చని అంచనా. (ప్రతీకాత్మక చిత్రం)
ఒప్పో కె10 5జీ
ఇది ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్. దీని ఫీచర్స్ ప్రత్యేకంగా తెలియకపోయిన కొన్ని రూమర్స్ ఇలా వినిపిస్తున్నాయి. HD+ రిజల్యూషన్, 90 hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌తో 6.56-అంగుళాల డిస్ప్లేతో లాంచ్ కానున్నట్లు సమాచారం. 8GB వరకు LPDDR4x RAM, 128GB UFS 2.2 స్టోరేజ్‌తో వస్తుందని భావిస్తున్నారు. MediaTek డైమెన్సిటీ 810 5G చిప్సెట్తో రూపొందించారని భావిస్తున్నారు. దీని ధర రూ. 20వేల లోపు ఉండే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
రియల్మీ జీటీ నియో 3టీ.. రియల్మీ ఈ నెల రెండు లేదా మూడో వారంలోఈ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేయనుంది. 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో ఫుల్హెచ్డీ+ డిస్ప్లే ఆకర్షణీయంగా ఉండనుంది. స్నాప్‌డ్రాగన్ 870 లేదా మీడియాటెక్ డైమెన్సిటీ డీ8100 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 80 వాట్ లేదా 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ ఉంటుందని సమాచారం. (ప్రతీకాత్మక చిత్రం)
పోకో సీ40
ఇది ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్. 1560 x 720 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్, 60 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.71-అంగుళాల LCD డిస్ప్లే ప్యానెల్‌తో లాంచ్ కానుంది. హ్యాండ్సెట్ JLQ JR10 చిప్సెట్తో పాటు 4 GB RAM/64 GB ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీతో రానుంది. ఇది జూన్ 16న భారత్‌లో లాంచ్ కానుంది. దీని ధర రూ. 12000 కంటే తక్కువగా ఉండవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
వెనుక భాగంలో 64-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్, 2-మెగాపిక్సెల్ మాక్రో లెన్స్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. సెల్ఫీల కోసం ముందుభాగంలో 16-మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది. 4,700mAh బ్యాటరీతో 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇవ్వనుంది. దీని ధర ₹25000 లోపు ఉండనున్నట్లు సమాచారం. (ప్రతీకాత్మక చిత్రం)