రియల్మీ ప్యాడ్ X డివైజ్ 2K రిజల్యూషన్‌తో 11 అంగుళాల డిస్ప్లేతో లాంచ్ అయింది. ఇది 6GB వరకు RAMతో పెయిర్ అయిన క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్తో పనిచేస్తుంది. RAM ఎక్స్పాన్షన్ టెక్నాలజీతో ట్యాబ్లెట్ ర్యామ్ కెపాసిటీని 11GB వరకు పొడిగించుకోవచ్చు. రియల్మీ ప్యాడ్ Xలో 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. మైక్రో SD కార్డ్ స్లాట్ ఈ స్టోరేజ్‌ను 512GB వరకు పొడిగించుకోచ్చు.
Xiaomi 11i హైపర్‌ఛార్జ్ 5G - ఈ ఫోన్ 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 920 SoC ద్వారా పనిచేస్తుంది. ఈ ఫోన్ 108-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌తో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేసే ఫుల్ HD+ AMOLED డిస్ప్లేతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీని ఇన్‌బిల్ట్ 4500mAh బ్యాటరీ 20 నిమిషాలలోపు ఫుల్ ఛార్జ్ అవుతుంది.
OnePlus Nord 2 - ఈ డివైజ్ 90Hz AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 1200 చిప్సెట్ ద్వారా పనిచేస్తుంది. గరిష్టంగా 12GB వరకు RAM ఉంటుంది. నార్డ్ 2 ఫోన్.. OIS సపోర్టెడ్ 50-మెగాపిక్సెల్ సెన్సార్‌తో, ట్రిపుల్-కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇది 65W ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,500mAh బ్యాటరీతో రన్ అవుతుంది.
Poco F3 GT - రూ.30వేలలో లభిస్తున్న బెస్ట్ గేమింగ్ ఫోన్ ఇది. పోకో F3 GT ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 1200 SoC చిప్సెట్తో పనిచేస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, 480Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.67-అంగుళాల AMOLED డిస్ప్లే వంటివి దీని స్పెషల్ ఫీచర్లు. 64-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5,065mAh బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జింగ్ స్పీడ్ సపోర్ట్, ఇతర ఫీచర్లతో డివైజ్ లభిస్తుంది.
మోటరోలా ఎడ్జ్ 20 - ఎడ్జ్ 20 స్మార్ట్‌ఫోన్ 6.7-అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ దీనికి రక్షణ ఇస్తుంది. ఇది 8GB RAM, 128GB స్టోరేజ్‌తో వచ్చే స్నాప్‌డ్రాగన్ 778G చిప్సెట్ ద్వారా పనిచేస్తుంది. ఈ డివైజ్ 4,000mAh బ్యాటరీతో వస్తుంది. ఆండ్రాయిడ్ 12 బేస్ట్ UIతో ఎడ్జ్ 20 ఫోన్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది.