1. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అలర్ట్. ఓవైపు గూగుల్ ఆండ్రాయిడ్‌లో ప్రైవసీ (Android Privacy) సమస్యల్ని పరిష్కరించేందుకు పనిచేస్తుంటే, లేటెస్ట్గా వెలువడ్డ ఓ రీసెర్చ్ పేపర్ కలకలం రేపుతోంది. గూగుల్ డయలర్, మెసేజెస్ యాప్స్ నుంచి గూగుల్ డేటాను సేకరిస్తోందన్నది ఆ రీసెర్చ్ పేపర్ సారాంశం. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో గూగుల్ డయలర్, మెసేజెస్ యాప్‌లు ప్రీ-ఇన్‌స్టాల్డ్‌గా వస్తాయి. "ఆండ్రాయిడ్‌లోని గూగుల్ డయలర్, మెసేజెస్ యాప్‌లు ఏ డేటాను గూగుల్‌కి పంపుతాయి" అనే టైటిల్‌తో రీసెర్చ్ పేపర్ పబ్లిష్ అయింది. ఈ యాప్స్ యూజర్ల అనుమతి లేకుండా గూగుల్‌కి డేటాను పంపుతున్నట్టు తేలింది. (ప్రతీకాత్మక చిత్రం)
4. గూగుల్ సేకరించే డేటాలో అందులో SHA26 హ్యాష్ మెసేజెస్, టైమ్ స్టాంప్స్, కాంటాక్ట్ వివరాలు, ఇన్కమింగ్, ఔట్గోయింక్ కాల్స్ వివరాలున్న కాల్ లాగ్స్, కాల్ డ్యూరేషన్ లాంటి వివరాలన్నీ ఉన్నాయి. ఈ వివరాలన్నీ హ్యాష్ రూపంలో ఉన్నా గూగుల్ హ్యాష్ తొలగించి మెసేజెస్‌లోని వివరాలు చూడగలదని డౌగ్లస్ లీత్ వివరించారు. (ప్రతీకాత్మక చిత్రం)
6. యూజర్ల ప్రైవసీకి సంబంధించి లోపాలను నివారించడానికి కొన్ని మార్పులు చేయాలని గూగుల్‌కు డౌగ్లస్ లీత్ సూచించారు. అయితే తాము డయలర్, మెసేజెస్ యాప్ నుంచి డేటాను స్వీకరించడానికి కారణాలను గూగుల్ వివరించింది. మెసేజ్ సీక్వెన్సింగ్ బగ్‌లను గుర్తించేందుకు మెసేజ్ హ్యాష్ సేకరిస్తున్నామని గూగుల్ తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
7. RCS ప్లాట్‌ఫారమ్ ద్వారా పంపబడే వన్-టైమ్ పాస్‌వర్డ్‌లను ఆటోమెటిక్‌గా డిటెక్ట్ చేసేందుకు ఫోన్ లాగ్‌లు ఉపయోగపడతాయని గూగుల్ వివరించింది. అయితే గూగుల్ ఇచ్చిన వివరణలపై క్లీన్ చిట్ ఇచ్చేలా లేవన్నది టెక్ నిపుణుల అభిప్రాయం. భవిష్యత్తులో అప్డేట్స్ ద్వారా యూజర్ల ప్రైవసీకి మేలు చేసేలా మార్పులు ఉంటాయని ఆశిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)