1. మీ ఫోన్లో GPSను యాక్టివ్‌గా ఉంచితే.. ఫోన్లో ఇన్స్టాల్ చేసే యాప్‌లు మీకు సంబంధించిన సమాచారాన్ని ట్రాక్ చేయవచ్చు. మీ లొకేషన్ ఆధారంగా ప్రమోషన్స్ నిర్వహించడంతో పాటు టార్గెటెడ్ యాడ్స్ సెండ్ చేయవచ్చు. కాబట్టి మీ ఆండ్రాయిడ్ ఫోన్లో GPSను ఎల్లప్పుడూ ఎనేబుల్ చేసుకోవడం మంచిది కాదు. (ప్రతీకాత్మక చిత్రం)
2. మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసే యాప్‌లు.. మీరు తరచుగా వెళ్లే ప్రాంతాలను గుర్తిస్తాయి. ఫేస్బుక్, గూగుల్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్స్‌కు మీ స్టెప్స్ అన్నీ ట్రాక్ చేసే సామర్థ్యం ఉంటుంది. దీంతోపాటు GPS యాక్టివ్‌గా ఉంటే, బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయ్యే ఈ ఫీచర్ మీ ఫోన్ బ్యాటరీ పవర్‌ను ఎక్కువగా వినియోగిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. మీ ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి, లిస్ట్‌లో యాప్స్ ట్యాబ్ ఓపెన్ చేయండి. ఇప్పుడు డిస్ప్లే అయ్యే ‘Permissions Manager‘ పేజీపై క్లిక్ చేయండి. ఈ లిస్ట్‌లో ‘Location’ అనే ట్యాబ్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేస్తే.. ఎలాంటి యాప్స్ మీ ఫోన్ GPSను యూజ్ చేస్తున్నాయో తెలుస్తుంది. వీటిలో ఏదైనా అప్లికేషన్‌కు GPSను మాన్యువల్‌గా ఆఫ్ చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. GPS (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) అనేది భూమి నుంచి 20,000 కి.మీల ఎత్తులో పరిభ్రమిస్తున్న NAVSTAR అనే 30 ఉపగ్రహాల నెట్‌వర్క్‌తో పనిచేసే వ్యవస్థ. GPS సిస్టమ్ రిసీవర్లతో పనిచేస్తుంది. భూమిమీద వ్యక్తులు లేదా వస్తువులు ఎక్కడ ఉన్నాయి, ఏ దిశగా కదులుతున్నాయనే నేవిగేషన్ ఫీచర్‌ను జీపీఎస్ మనకు అందిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)