అలాంటి వారి కోసం ఇక్కడ ఓ మంచి ఐడియా ఉంది. మీరు ఇంట్లో ఉంచిన పాత ఫోన్‌ను సిసిటివిగా ఉపయోగించవచ్చు. ఆ ఫోన్ మీకు అచ్చం సీసీటీవీలాగ పని చేస్తుంది. పాత ఫోన్ CCTVగా ఎలా మారుతుందో మీరు ఆశ్చర్యపోకండి.. ఇక్కడ చెప్పే విధంగా ఫాలో అయితే మీకు అర్థం అవుతుంది. వివరాల్లోకి పూర్తిగా తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
మీరు ఈ ఫోన్‌కు కచ్చితంగా ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలి. ఈ పాత ఫోన్లో బ్యాటరీ అయిపోకుండా ఉండాలంటే, మీరు దానికి విద్యుత్ సరఫరాను కూడా అందించాలి. లేదా పవర్ బ్యాంక్‌ని జోడించాలి. అలాగే కెమెరాపై దుమ్ము, ధూళి పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఇలా చేస్తే.. మీరు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి.. ఖరీదైన సీసీటీవీలను కొనాల్సిన అవసరం ఉండదు.