1. కొన్ని యాప్ ద్వారా మీకు తెలియకుండానే మీ ఫోన్లోని డేటాను హ్యాకర్లు (Hackers) రహస్యంగా దొంగిలిస్తున్నారు. అంతేకాకుండా మీ బ్యాంక్ వివరాలను, డీ మ్యాట్ అకౌంట్(Dmat Account) వివరాలను కూడా చోరీ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఫ్రాన్స్‌కు చెందిన రీసెర్చ్ ఏజెన్సీ ప్రాడియో (pradeo) తన పరిశోధనలో వెల్లడించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ముఖ్యంగా గూగుల్ ప్లేస్టోర్‌లో 2FA పేరుతో ఒక యాప్ ఉందని... దాన్ని ఇప్పటికే 10 వేల మందికిపైగా వారు తమ స్మార్ట్ ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకున్నట్లు ప్రాడియో పేర్కొంది. హ్యాకర్లు ఈ యాప్‌లో వాల్టుర్ (vultur) అనే ఒక మాల్వేర్ (malware)ను ఉంచారని... దాని ద్వారా ఈ యాప్‌ను వాడుతున్న వారి ఆర్థిక లావాదేవీలను, బ్యాంక్ ఖాతా నంబర్లు, పాస్వర్డ్స్ వంటి వాటిని హ్యాక్ చేస్తున్నట్లు ప్రాడియో తన రిపోర్ట్‌లో పేర్కొంది. గూగుల్ ప్లేస్టోర్ నుంచి దీన్ని తొలిగించారని అయినా యూర్లు అలర్ట్‌గా ఉండాలని సూచించింది. (ప్రతీకాత్మక చిత్రం)
5. మీరు లాగిన్ అయ్యేటప్పుడు మీ యూజర్నేప్ పాస్‌వర్డ్‌తో మొదట ఎంటర్ అవుతారు... అనంతరం మీ మొబైల్లోని గూగుల్ ఆథంటికేటర్కు 2FA పాస్వర్డ్ వస్తుంది. ఇది కొన్ని సెకండ్ల పాటే యాక్టివ్‌గా ఉంటుంది. అంతలోపు మీరు ఆ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. అయితే టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి రావడంతో హ్యాకర్లు 2FA పేరుతో కుప్పలు తెప్పలుగా యాప్‌లను క్రియేట్ చేసి ప్లే స్టోర్‌లో ఉంచారు. (ప్రతీకాత్మక చిత్రం)