ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్, ఫ్లిప్‌కార్ట్ సేల్" width="1200" height="800" /> 1. దేశంలో మరో కొత్త, బడ్జెట్ నార్జో సిరీస్ ఫోన్‌ను లాంచ్ చేయడానికి కంపెనీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో నార్జో 50 5జీ (Narzo 50 5G) స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు ధ్రువీకరించింది. గత సంవత్సరం విడుదలైన నార్జో 30 5G సక్సెసర్‌గా ఈ మోడల్ రానుంది. (ప్రతీకాత్మక చిత్రం)
స్మార్ట్‌ఫోన్ ఆఫర్స్" width="1200" height="800" /> 2. ఇది గేమింగ్ స్మార్ట్‌ఫోన్ అని కంపెనీ పేర్కొంది. ధరకు తగ్గట్లు అత్యుత్తమ ఫీచర్లను అందిస్తుందని, ఈ సెగ్మెంట్లో ఫాస్టెస్ట్ 5G ప్రాసెసర్‌తో వస్తుందని రియల్మీ వెల్లడించింది. సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు.. రాజద్రోహ చట్టం నిలిపివేత.. మోదీ సర్కార్ యూటర్న్‌తో.. ఈ కొత్త ఫోన్ లాంచింగ్ గురించి రియల్మీ ఒక ప్రకటన విడుదల చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
మొబైల్ ఆఫర్స్, స్మార్ట్‌ఫోన్ డిస్కౌంట్ ఆఫర్స్" width="1200" height="800" /> 3. అందులో.. ‘ప్రతి నార్జో ఫోన్‌తో గేమింగ్ ఎక్స్పీరియన్స్ మరింత మెరుగుపరచడానికి టాప్ ఫీచర్లు, లేటెస్ట్, బోల్డ్ డిజైన్స్‌తో అత్యంత శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తాం. 2022 జనవరిలో నార్జో లాంచ్ అయినప్పటి నుంచి 10 మిలియన్లకు పైగా యూజర్ బేస్‌ను చేరుకుంది. ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వినియోగదారులను చేరుకోవాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం.’ అని పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. నార్జో సిరీస్‌కు త్వరలో కంపెనీ చేర్పులు చేయనున్నట్లు రియల్మీ ఇండియా సీఈఓ మాధవ్ సేత్ తెలిపారు. ‘కొత్త నార్జో స్మార్ట్ఫోన్లు మరింత శక్తివంతమైన 5G ప్రాసెసర్లు, బెస్ట్ డిజైన్, అద్భుతమైన డిస్ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తాయి. ఇండియాలో 2022లోనే 5G నెట్వర్క్ విడుదలయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఆన్లైన్ ఛానెల్‌లలో బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఎప్పటిలాగే రియల్మీ యూత్‌ను టార్గెట్‌గా చేస్తూ ప్రొడక్ట్స్ రూపొందిస్తుంది.’ అని వెల్లడించారు. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఆన్లైన్ రిపోర్ట్స్ ప్రకారం ఈ ఫోన్ 1080x2408 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.58-అంగుళాల ఫుల్ HD+ డిస్ప్లేతో రానున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ గరిష్టంగా 6GB RAMతో పెయిర్ అయిన ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్సెట్తో రానుంది. దీని ఇంటర్నల్ స్టోరేజ్ 128GB వరకు ఉండొచ్చని అంచనా. (ప్రతీకాత్మక చిత్రం)
6. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను మరింత విస్తరించవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 13MP మెయిన్ సెన్సార్, 2MP సెకండరీ సెన్సార్ ఉన్న డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో నార్జో 50 ఫోన్ రావచ్చని నివేదికలు చెబుతున్నాయి. సెల్ఫీల కోసం 8MP ఫ్రంట్ కెమెరాను అందించనుంది. (ప్రతీకాత్మక చిత్రం)