Earphones: ఆ ఇయర్‌ఫోన్స్ ధర రూ.1,29,990... షాకయ్యారా? ఎందుకో తెలుసుకోండి
Earphones: ఆ ఇయర్‌ఫోన్స్ ధర రూ.1,29,990... షాకయ్యారా? ఎందుకో తెలుసుకోండి
Sennheiser IE 900 | ఇయర్‌ఫోన్స్ కొనాలంటే ఎవరైనా ఎంత ఖర్చు చేస్తారు? ఐదారు వందలు ఖర్చు చేస్తారు. లేదా కాస్త మంచి క్వాలిటీ కావాలంటే రెండు వేల వరకు ఖర్చు చేస్తారు. కానీ ఏ హెడ్‌ఫోన్స్ కొనాలంటే రూ.లక్షకు పైనా కావాలి. ఆ ఇయర్‌ఫోన్స్ ఎందుకు అంత కాస్ట్లీనో తెలుసుకోండి.
1. జర్మనీకి చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ సెన్‌హైసర్ ఇండియాలో ఖరీదైన ఇయర్‌ఫోన్స్ రిలీజ్ చేసింది. ఈ ఇయర్‌ఫోన్స్ ఎంత ఖరీదంటే ఏకంగా ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు. లేదా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్స్ అయితే ఓ 10 ఫోన్లు కొనేయొచ్చు. (image: Sennheiser India)
2/ 10
2. సెన్‌హైసర్ రిలీజ్ చేసి ఈ ఇయర్‌ఫోన్స్ ధర రూ.1,29,990. అంటే లక్షా ముప్పై వేల రూపాయలు. సెన్‌హైసర్ ఐఈ 900 పేరుతో ఈ ఇయర్‌ఫోన్స్ ఇండియాలో రిలీజ్ అయ్యాయి. (image: Sennheiser India)
3/ 10
3. సెన్‌హైసర్ ఐఈ 900 ఇయర్‌ఫోన్స్ ప్రీబుకింగ్ మొదలైంది. సెన్‌హైసర్ వెబ్‌షాప్‌లో ఆర్డర్ చేయొచ్చు. ఇందులో X3R సిస్టమ్ ఉంది. సాధారణంగా ఇలాంటి సౌండ్ సిస్టమ్ భారీసైజ్ హెడ్ఫోన్లలో ఉంటుంది. (image: Sennheiser India)
4/ 10
4. ఈ ఇయర్‌ఫోన్స్‌లో మల్టీ డ్రైవర్ సిస్టమ్ కాకుండా వన్ డ్రైవర్ సిస్టమ్ ఉండటం విశేషం. 7 ఎంఎం ట్రూ రెస్పాన్స్ ట్రాన్స్‌డ్యూసర్ ఉంటుంది. ఈ ఇయర్‌ఫోన్స్ జర్మనీలోనే తయారైంది. (image: Sennheiser India)
5/ 10
5. ఇంత ఖరీదైన ఇయర్‌ఫోన్స్ తయారుచేసేందుకు సెన్‌హైసర్ చాలా కృషి చేసింది. మెషీన్‌తో కాకుండా చేతితో ఈ ఇయర్‌ఫోన్స్ తయారు చేయడం విశేషం. గోల్డ్ ప్లేటెట్ ఫడెలిటీ ఎంఎంసీఎక్స్ కనెక్టర్స్ ఉన్నాయి. (image: Sennheiser India)
6/ 10
6. డీజే ఆపరేటర్స్, ప్రొఫెషనల్ డ్యాన్సర్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఇయర్‌ఫోన్స్ ఇవి. ఇండియాలో ఇంత ఖరీదైన ఇయర్‌ఫోన్స్ లాంఛ్ కావడం ఇదే మొదటిసారి. (image: Sennheiser India)