ఈ రోజుల్లో బ్యాంకింగ్ సేవలు ప్రజలకు చాలా సులభమయ్యాయి. బ్యాంకులు అందించే వివిధ సేవల ద్వారా చిటికెలో డబ్బులను ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి ఏర్పడింది.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
అయితే.. సేవలు సులభమవుతున్నా కొద్దీ సైబర్ నేరాలు సైతం అధికమవుతున్నాయి. వివిధ మార్గాల సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేసి వారి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ సైబర్ నేరాలపై ఎప్పటికప్పుడు వినియోగదారులకు అవగాహన కల్పిస్తూ ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
తాజాగా ట్విట్టర్ వేధికగా బ్యాంకు సైబర్ నేరాలపై ప్రకటన విడుదల చేసింది. తద్వారా వినియోగదారులకు పలు సూచనలు చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
మీ బ్యాంకు ఖాతాల విషయంలో ఏదైనా అనుమానాస్పద ఘటన చోటు చేసుకుంటే వెంటనే సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేయాలని సూచించింది.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
సైబర్ క్రైమ్ కు సంబంధించిన ఫిర్యాదులను కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన cybercrime.gov.in వెబ్ సైట్లో నమోదు చేయాలని సూచించింది.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
లేదా 155260 హెల్ప్ లైన్ నంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు.(ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
మీ ప్రమేయం లేకుండా ఏదైనా లావాదేవీలు జరిగినా, లేదా డెబిట్ కార్డ్ మరియు ఇంటర్ నెట్ బ్యాంకింగ్ ను బ్లాక్ చేయాలన్నా ఎస్బీఐ కస్టమర్ కేర్ నంబర్ 1800111109 నంబర్ ను సంప్రదించాలని వెల్లడించారు.(ప్రతీకాత్మక చిత్రం)