1. Vivo S1: కొద్దిరోజుల క్రితం ఎస్ సిరీస్‌ను ఇండియాకు పరిచయం చేసింది వివో. కొత్త మోడల్ వివో ఎస్1 ఇండియాలో లాంఛ్ చేసింది. మొదట 4జీబీ+128జీబీ మోడల్ రిలీజ్ చేసింది వివో. ఆ తర్వాత వివో ఎస్1 కొత్త అప్‌గ్రేడ్ వేరియంట్ తీసుకొచ్చింది. వివో ఎస్1 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+128జీబీ ధర రూ.17,990 కాగా అప్‌గ్రేడెడ్ వేరియంట్ 6జీబీ+64జీబీ ధర రూ.18,990. ఇక 6జీబీ+128జీబీ ధర రూ.19,990. వివో ఎస్1 స్పెసిఫికేషన్స్ చూస్తే 6.38 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమొలెడ్ డిస్ఫ్లే ఉండటం విశేషం. స్మార్ట్‌ఫోన్‌లో ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లున్నాయి. (image: Vivo India)
2. Vivo S1: వివో ఎస్1 సెల్ఫీ కెమెరా 32 మెగాపిక్సెల్. వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌తో ఉండటం మరో విశేషం. 16 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. వివో ఎస్1 స్మార్ట్‌ఫోన్ 4కే వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తుంది. హెచ్డీఆర్, జియో ట్యాగింగ్, పనోరమా, పోర్ట్రైట్ ఫీచర్లున్నాయి. వివో ఎస్1 మీడియాటెక్ పీ65 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 4,500 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో వస్తుంది. క్విక్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది. (image: Vivo India)
3. Redmi 8A: ఇండియాలో తొలిసారిగా రెడ్మీ 8 సిరీస్‌లో రెడ్మీ 8ఏ రిలీజ్ చేసింది షావోమీ. 5,000 ఎంఏహెచ్ బిగ్ బ్యాటరీ, టైప్ సీ పోర్ట్, 18వాట్ ఛార్జింగ్ సపోర్ట్, నాచ్ డిస్ప్లే లాంటి ఫీచర్లతో తక్కువ ధరకే రెడ్మీ 8ఏ అందిస్తుండటం విశేషం. రెడ్మీ 7ఏ అప్‌గ్రేడ్ వర్షన్‌గా రెడ్మీ 8ఏ రిలీజైంది. రెడ్మీ 8ఏ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.22 అంగుళాల హెచ్డీ డిస్ప్లే ఉండటం విశేషం. రెడ్మీ 8ఏ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 439 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. (image: Xiaomi India)
4. Redmi 8A: రెడ్మీ 8ఏ రియర్ కెమెరా 12 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్. రెడ్మీ 8ఏ డ్యూయెల్ సిమ్+మెమొరీ కార్డ్ స్లాట్‌తో రావడం మరో విశేషం. రెడ్మీ 8ఏ మిడ్నైట్ బ్లాక్, ఓషియన్ బ్లూ, సన్‌సెట్ రెడ్ కలర్స్‌లో లభిస్తుంది. రెడ్మీ 8ఏ 2జీబీ + 32జీబీ ధర రూ.6,499 కాగా 3జీబీ + 32జీబీ ధర రూ.6,999. (image: Xiaomi India)
5. Vivo U10: అదిరిపోయే ఫీచర్లతో వివో యూ10 రిలీజ్ చేసింది వివో. బడ్జెట్ సెగ్మెంట్లోకి వచ్చిన కొత్త ఫోన్ ఇది. వివో యూ10 స్మార్ట్‌ఫోన్‌లో వాటర్ డ్రాప్ నాచ్, 5,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, ట్రిపుల్ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ లాంటి ప్రత్యేకతలున్నాయి. వివో యూ10 స్పెసిఫికేషన్స్ చూస్తే 6.35 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే ఉండటం విశేషం. వివో యూ10 స్నాప్‌డ్రాగన్ 655 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. (image: Vivo India)
6. Vivo U10: వివో యూ10 రియర్ కెమెరా 13+8+2 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్. వివో యూ10 బ్యాటరీ 5,000 ఎంఏహెచ్. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. వివో యూ10 ఎలక్ట్రిక్ బ్లూ, థండర్ బ్లాక్ కలర్స్‌లో లభిస్తుంది. వివో యూ10 స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ ధర రూ.8,990 కాగా, 3జీబీ+64జీబీ ధర రూ.9,990. ఇక హైఎండ్ వేరియంట్ 4జీబీ+64జీబీ ధర రూ.10,990. అమెజాన్‌లో సెప్టెంబర్ 29న సేల్ ప్రారంభం కానుంది. (image: Vivo India)
7. Vivo V17 Pro: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఏకంగా రెండు సెల్ఫీ కెమెరాలతో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది. అది కూడా పాప్ అప్ సెల్ఫీ కెమెరా. వివో కొత్తగా రిలీజ్ చేసిన వివో వీ17 ప్రో స్మార్ట్‌ఫోన్‌లోని అద్భుతమైన ఫీచర్ ఇది. రెండు సెల్ఫీ కెమెరాలు, నాలుగు రియర్ కెమెరాలు ఉండటం ఈ ఫోన్ ప్రత్యేకత. అంటే మొత్తం 6 కెమెరాల స్మార్ట్‌ఫోన్ ఇది. 48 మెగాపిక్సెల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. వివో వీ17 ప్రో స్పెసిఫికేషన్స్ చూస్తే 6.4 అంగుళాల సూపర్ అమొలెడ్ డిస్ప్లే ఉంది. స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. (image: Vivo India)
8. Vivo V17 Pro: వివో వీ17 ప్రో రియర్ కెమెరా 48+13+8+2 మెగాపిక్సెల్ కాగా, 32+8 మెగాపిక్సెల్ పాప్ అప్ సెల్ఫీ కెమెరా. వివో వీ17 ప్రో బ్యాటరీ 4,100 ఎంఏహెచ్. వివో వీ17 ప్రో ఆండ్రాయిడ్ 9 + ఫన్ టచ్ ఓఎస్ 9.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 9. వివో వీ17 ప్రో మిడ్నైట్ ఓషియన్, గ్లేసియర్ ఐస్ కలర్స్‌లో లభిస్తుంది. (image: Vivo India)
11. Samsung Galaxy M30s: సాంసంగ్ గెలాక్సీ ఎం30 అప్డేట్ వర్షన్ సాంసంగ్ గెలాక్సీ ఎం30ఎస్ వచ్చింది. ఇందులో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండటం విశేషం. సాంసంగ్ గెలాక్సీ ఎం30ఎస్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.4 అంగుళాల ఫుల్హెచ్డీ+ ఇన్ఫినిటీ యూ సూపర్ అమొలెడ్ డిస్ప్లే ఉంది. ఎక్సినోస్ 9611 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. (image: Amazon India)
12. Samsung Galaxy M30s: సాంసంగ్ గెలాక్సీ ఎం30ఎస్ రియర్ కెమెరా 48+8+5 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్. ఆండ్రాయిడ్ 9 పై + వన్ యూఐ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఓపల్ బ్లాక్, సాఫైర్ బ్లూ, పెరల్ వైట్ కలర్స్‌లో లభిస్తుంది. సాంసంగ్ గెలాక్సీ ఎం30ఎస్ 4జీబీ+64జీబీ రూ.13,999 కాగా, 6జీబీ+128జీబీ రూ.16,999. (image: Amazon India)
15. Moto E6S: మోటో ఈ6ఎస్ మోడల్‌ను రిలీజ్ చేసింది మోటోరోలా. రూ.7,999 ధరకే 4జీబీ+64జీబీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసి ప్రత్యర్థులకు సవాల్ విసురుతోంది. మోటో ఈ6ఎస్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.1 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉండటం విశేషం. మోటో ఈ6ఎస్ మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. (image: Motorola India)
16. Moto E6S: మోటో ఈ6ఎస్ రియర్ కెమెరా 13+2 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్. బ్యాటరీ 3000 ఎంఏహెచ్. మోటో ఈ6ఎస్ ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్. ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. డ్యూయెల్ సిమ్ సిమ్ సపోర్ట్ చేస్తుంది. మోటో ఈ6ఎస్ పాలిష్డ్ గ్రాఫైట్, రిచ్ క్రాన్బెర్రీ కలర్స్‌లో లభిస్తుంది. (image: Motorola India)
18. Samsung Galaxy A50S: సాంసంగ్ గెలాక్సీ ఏ50ఎస్ రియర్ కెమెరా 48+8+5 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్. బ్యాటరీ 4,000 ఎంఏహెచ్. ప్రిస్మ్ క్రష్ వయొలెట్, ప్రిస్మ్ క్రష్ బ్లాక్, ప్రిస్మ్ క్రష్ వైట్ కలర్స్‌లో లభిస్తుంది. 4 జీబీ + 128 జీబీ ధర రూ.22,999 కాగా, 6 జీబీ + 128 జీబీ ధర రూ.24,999.
21. iPhone 11 Series: ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేసింది యాపిల్. ఐఫోన్ 11 స్పెసిఫికేషన్స్ చూస్తే 6.1 అంగుళాల లిక్విడ్ రెటీనా డిస్ప్లే ఉంది. ర్యామ్ 4 జీబీ కాగా ఇంటర్నల్ స్టోరేజ్ 64 జీబీ, 128 జీబీ, 256 జీబీ వేరియంట్లలో లభిస్తుంది. ఐఫోన్ 11 స్మార్ట్‌ఫోన్ యాపిల్ ఏ13 బయోనిక్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఐఫోన్ 11 రియర్ కెమెరా 12+12 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 12 మెగాపిక్సెల్. బ్యాటరీ 3,110 ఎంఏహెచ్. ఆపరేటింగ్ సిస్టమ్ ఐఓఎస్ 13. ఐఫోన్ 11 పర్పుల్, గ్రీన్, యెల్లో, బ్లాక్ కలర్స్‌లో లభిస్తుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర: రూ.64,900. (image: Apple)
22. iPhone 11 Series: ఐఫోన్ 11 ప్రో స్పెసిఫికేషన్స్ చూస్తే 5.8 అంగుళాల లిక్విడ్ రెటీనా డిస్ప్లే ఉంది. ర్యామ్ 6 జీబీ కాగా ఇంటర్నల్ స్టోరేజ్ 64 జీబీ, 256 జీబీ, 512 జీబీ వేరియంట్లలో లభిస్తుంది. ఐఫోన్ 11 ప్రో యాపిల్ ఏ13 బయోనిక్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఐఫోన్ 11 ప్రో రియర్ కెమెరా 12+12+12 మెగాపిక్సెల్ కాగా ఫ్రంట్ కెమెరా 12 మెగాపిక్సెల్. బ్యాటరీ 3,190 ఎంఏహెచ్. ఆపరేటింగ్ సిస్టమ్ ఐఓఎస్ 13. ఐఫోన్ 11 ప్రో స్పేస్ గ్రే, సిల్వర్, గోల్డ్, మిడ్నైట్ గ్రీన్ కలర్స్‌లో లభిస్తుంది. ప్రారంభ ధర రూ.99,900. ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.5 అంగుళాల లిక్విడ్ రెటీనా డిస్ప్లే ఉంది. ర్యామ్ 6 జీబీ కాగా, ఇంటర్నల్ స్టోరేజ్ 64 జీబీ, 256 జీబీ, 512 జీబీ వేరియంట్లలో లభిస్తుంది. ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ యాపిల్ ఏ13 బయోనిక్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. (image: Apple)
23. Vivo Z1x: రియల్మీ, షావోమీ, సాంసంగ్ స్మార్ట్ఫోన్లకు పోటీగా వివో జెడ్1ఎక్స్ మోడల్‌ను ఇండియాకు పరిచయం చేసింది వివో. జెడ్ సిరీస్‌లో వివో రిలీజ్ చేసిన రెండో ఫోన్ ఇది. వివో జెడ్1ఎక్స్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.38 అంగుళాల సూపర్ అమొలెడ్ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 712 ప్రాసెసర్ ఉన్నాయి. వివో జెడ్1ఎక్స్ రియర్ కెమెరా 48+8+2 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్. (image: Vivo)
24. Vivo Z1x: వివో జెడ్1ఎక్స్ 4,500 ఎంఏహెచ్. 22వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. వివో జెడ్1ఎక్స్ ఆండ్రాయిడ్ 9 పై + ఫన్ టచ్ ఓఎస్ 9.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. వివో జెడ్1ఎక్స్ ఫ్యూజన్ బ్లూ, ఫాంటమ్ పర్పుల్ కలర్స్‌లో లభిస్తుంది. వివో జెడ్1ఎక్స్ 6జీబీ+64జీబీ ధర రూ.16,990 కాగా, 6జీబీ+128జీబీ ధర రూ.18,990. (image: Vivo)