దక్షిణ కొరియాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ శ్యామ్‌సంగ్ (Samsung) వరుస స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేస్తూ మార్కెట్లో దూసుకుపోతుంది. గత వారమే శ్యామ్ సంగ్ గెలాక్సీ A13 (Samsung Galaxy A13) , గెలాక్సీ A23 (Samsung Galaxy A23) ని విడుదల చేసిన కంపెనీ ఇప్పుడు మరో స్మార్ట్ ఫోన్ లాంచింగ్‌కు సిద్దమవుతోంది.
ఏప్రిల్ 2న శ్యామ్‌సంగ్ గెలాక్సీ M33 5G (Samsung Galaxy M33 5G) పేరుతో మిడ్-రేంజ్ 5జీ ఫోన్‌ను ఆవిష్కరించనుంది. భారత్‌లో శ్యామ్‌సంగ్ గెలాక్సీ M33 5G ఫోన్ లాంచింగ్‌ను అమెజాన్ (Amazon) ధృవీకరించబడింది. ఈ స్మార్ట్ ఫోన్ భారతదేశంలో ఏప్రిల్ 2న మధ్యాహ్నం 12PM (మధ్యాహ్నం) ISTకి రిలీజ్ కానుంది. అమెజాన్ ద్వారా అమ్మకాలు జరగనున్నాయి. కాగా, అమెజాన్ ఏప్రిల్ 2న గెలాక్సీ M33 5G క్విజ్‌ను కూడా నిర్వహించనుంది. దీనిలో విజేతలుగా నిలిచిన వారికి శ్యామ్‌సంగ్ గెలాక్సీ M33 5Gని ఉచితంగా అందజేస్తుంది.
శ్యామ్‌సంగ్ గెలాక్సీ M33 5G స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. 5nm ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో కూడిన 8GB ర్యామ్,128B ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లోని 6,000mAh బ్యాటరీ 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.6- అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది. (ప్రతీకాత్మకచిత్రం)
ఇక, కెమెరా విషయానికి వస్తే.. ఇది క్వాడ్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. దీనిలో 50 -మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, 5- మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ షూటర్, 2- మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, 2 -మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు ఉంటాయి. ఈ స్మార్ట్‌ఫోన్ హెడ్‌ఫోన్ జాక్‌తో పాటు సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో వస్తుంది. (ప్రతీకాత్మకచిత్రం)
కాగా, గత వారం మార్కెట్లోకి వచ్చిన శ్యామ్‌సంగ్ గెలాక్సీ A13 4GB RAM మోడల్ ధర రూ. 14,999 నుండి ప్రారంభమవుతుంది. మరోవైపు, శ్యామ్‌సంగ్ గెలాక్సీ A23 6GB RAM మోడల్ ధర రూ. 19,499 నుండి, 8GB వేరియంట్ ధర రూ. 20,999 నుండి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్లను శ్యామ్‌సంగ్ అధికారిక వవెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. (ప్రతీకాత్మకచిత్రం)