Samsung Republic day sale : శాంసంగ్ రిపబ్లిక్ డే సందర్భంగా 'గ్రాండ్ సేల్'ని ప్రకటించింది. ఇందులో కస్టమర్లకు కంపెనీకి చెందిన వివిధ ఉత్పత్తులపై వివిధ రకాల ఆఫర్లు.. తగ్గింపులు ఇస్తున్నారు. జనవరి 17న ప్రారంభమై జనవరి 21, 2023 వరకు అమలులో ఉండే 'గ్రాండ్ రిపబ్లిక్ సేల్'లో భాగంగా అనేక ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నారు. Samsung.com లేదా Samsung Shop యాప్, శాంసంగ్ డిజిటల్ స్టోర్ల నుంచి కస్టమర్లు ఈ సేల్ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవచ్చు.
టెక్ దిగ్గజం గెలాక్సీ స్మార్ట్ఫోన్ల శ్రేణిపై 61% వరకు తగ్గింపును అందిస్తోంది. శామ్సంగ్ టీవీలు 56% వరకు తగ్గింపుతో అందుబాటులో ఉంచారు. Galaxy ల్యాప్టాప్లు 38% వరకు తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి అలాగే.. టాబ్లెట్లు 63% వరకు తగ్గింపుతో లభిస్తాయి. ఈ సేల్ Galaxy Watch5, Galaxy Buds2 ప్రో వంటి గెలాక్సీ ఉపకరణాలపై కూడా ఆఫర్లను అందిస్తోంది.
సగం ధరకే జనాధరణ పొందిన ఫోన్లు : గ్రాండ్ రిపబ్లిక్ సేల్ సమయంలో వినియోగదారులు Galaxy Z Fold4, Galaxy S21 FE, Galaxy S20 FE, Galaxy M33, Galaxy M13, Galaxy F23, Galaxy A73, Galaxy A723, Galaxy A3 వంటి Samsung Galaxy స్మార్ట్ఫోన్లను ఆఫర్లలో పొందవచ్చు. Galaxy A03 కోర్లో 61% వరకు తగ్గింపును పొందవచ్చు.