దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శామ్సంగ్ (Samsung) స్మార్ట్‌ఫోన్ (Smartphone) విభాగంలో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఆండ్రాయిడ్‌తో రన్ అయ్యే ఫోన్లను లాంచ్ చేస్తున్న కంపెనీలలో టాప్ వాటాను పొందింది. ఈ కంపెనీ ఫిబ్రవరి 1న జరిగిన Samsung Galaxy Unpacked ఈవెంట్ 2023లో గెలాక్సీ ఎస్23 సిరీస్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.
* 24 గంటల్లో 1.4 లక్షల యూనిట్స్ బుకింగ్స్ : శామ్సంగ్ ఇండియా, మొబైల్ బిజినెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజు పుల్లాన్ మాట్లాడుతూ.. మొదటి 24 గంటల్లో దాదాపు 1.4 లక్షల యూనిట్స్ ప్రీ-బుకింగ్స్ వచ్చాయని తెలిపారు. ఇది గెలాక్సీ S22కి దాదాపు రెండు రెట్లు ఎక్కువని పేర్కొన్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ సగటు ధర సుమారు లక్ష రూపాయలతో ప్రీ-బుకింగ్స్ విలువ దాదాపు రూ.1,400 కోట్లని రాజు పుల్లాన్ వెల్లడించారు.
* ఫిబ్రవరి 23 వరకు ప్రీ-బుకింగ్ సదుపాయం : శామ్సంగ్ గెలాక్సీ ఎస్23 ప్రీ-బుకింగ్ ఫిబ్రవరి 23 వరకు కొనసాగనుంది. ఈ సిరీస్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్23, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ప్లస్, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా అనే పేర్లుతో మూడు హై- ఎండ్ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. భారత్‌లో గెలాక్సీ S23 సిరీస్ ప్రైజ్ రేంజ్ రూ.75,000 నుంచి రూ.1.55 లక్షల మధ్య ఉంది.
* వడ్డీ లేకుండా 24 వాయిదాల్లో : హై-ఎండ్ గెలాక్సీ S23 అల్ట్రాను ప్రీ-బుకింగ్ కోసం రూ. 48,000 విలువైన శామ్సంగ్ గెలాక్సీ 4 LTE , రూ. 4,999 విలువైన గెలాక్సీ Buds 2 ధరలను దాదాపు 90 శాతం తగ్గించింది. అంతేకాకుండా 24 వాయిదాల్లో ఎలాంటి వడ్డీ లేకుండా కొనుగోలు చేయవచ్చు. ఇక, శామ్సంగ్ ఫైనాన్స్ ద్వారా 15 ఇన్స్టాల్మెంట్లలో S23 అల్ట్రాను కొనుగోలు చేయడానికి శామ్సంగ్ అవకాశం కల్పించింది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ప్లస్: ఈ స్మార్ట్‌ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డైనమిక్ అమోలెడ్ 2X డిస్ప్లే ఉంటుంది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, రియర్ ట్రిపుల్ రియర్ కెమెరా(50MP + 12MP + 10MP) సెటప్, 12MP సెల్ఫీ కెమెరా, 4,700 mAh బ్యాటరీ వంటి ఫీచర్స్ ఈఫోన్ ప్రత్యేకతలు.
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా: ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.8 అంగుళాల క్వాడ్ హెచ్డీ+ డిస్ప్లే ఉంటుంది. స్క్రీన్ రిజల్యూషన్ 1440 x 3088 పిక్సెల్స్‌గా ఉంటుంది. సెక్యూరిటీ కోసం ఫోన్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, రియర్ ట్రిపుల్ కెమెరా(200MP +12MP+10MP)సెటప్, 12 MP సెల్ఫీ కెమెరా, 5000mAh బ్యాటరీ వంటి ఫీచర్స్ ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నాయి.