1. సాంసంగ్ ఈ ఏడాది ప్రారంభంలో గెలాక్సీ ఏ32 స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్లో మాత్రమే ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. ఇప్పుడు 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్లో లేటెస్ట్ మోడల్ రిలీజ్ చేసింది. సాంసంగ్ అధికార వెబ్‌సైట్‌తో పాటు ఇతర ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో కొనొచ్చు. సేల్ మొదలైంది. (image: Samsung India)
2. సాంసంగ్ గెలాక్సీ ఏ32 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.21,990 కాగా, ఇప్పుడు రిలీజ్ అయిన 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.23,499. అంటే రూ.1,500 ఎక్కువ ఖర్చుపెడితే 8జీబీ ర్యామ్ సొంతం చేసుకోవచ్చు. ఇక 6జీబీ+128జీబీ వేరియంట్ గతంలో ఆఫర్లో రూ.18,999 ధరకు లభించిన సంగతి తెలిసిందే. (image: Samsung India)
5. ప్రస్తుతం సాంసంగ్ గెలాక్సీ ఏ32 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ వేరియంట్స్‌తో లభిస్తుంది. ఇందులో ఇంటెలిజెంట్ మెమొరీ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్ ఉంది. ఈ ఫీచర్‌తో ర్యామ్‌ను 4జీబీ వరకు పెంచుకోవచ్చు. అంటే 6జీబీ ఫోన్లో 10జీబీ ర్యామ్, 8జీబీ ఫోన్లో 12జీబీ ర్యామ్ వాడుకోవచ్చు. (image: Samsung India)
6. సాంసంగ్ గెలాక్సీ ఏ32 స్మార్ట్‌ఫోన్‌లో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. వెనుకవైపు 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా + 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ + 5 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో నాలుగు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండటం విశేషం. (image: Samsung India)