1. సాంసంగ్ రెండు నెలల క్రితం రిలీజ్ చేసిన సాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ (Samsung Galaxy F23 5G) స్మార్ట్‌ఫోన్ రూ.20,000 లోపు సెగ్మెంట్లో మిగతా బ్రాండ్స్‌కు గట్టి పోటీ ఇస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆఫర్లో రూ.15,000 లోపు ధరకే లభిస్తుండటం విశేషం. కొత్తగా కాపర్ బ్లష్ కలర్లో ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. అదిరిపోయేలా ఉన్న కొత్త కలర్ కస్టమర్లను ఆకట్టుకోవడం ఖాయం. (image: Samsung India)
2. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ స్మార్ట్‌ఫోన్ మొదట ఆక్వా బ్లూ, ఫారెస్ట్ గ్రీన్ కలర్స్‌లో రిలీజైంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు లభిస్తున్న క్రేజ్ చూసి కంపెనీ కొత్త కలర్‌ను పరిచయం చేసింది. కాపర్ బ్లష్ కలర్లో రిలీజైంది. ధరలో ఎలాంటి మార్పు లేదు. ఆక్వా బ్లూ, ఫారెస్ట్ గ్రీన్ కలర్స్ ఏ ధరకు లభిస్తున్నాయో కాపర్ బ్లష్ కలర్ మొబైల్‌ను కూడా అదే ధరకు కొనొచ్చు. (image: Samsung India)
3. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయినప్పుడు ధరలు చూస్తే 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,499 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,499. అయితే సాంసంగ్ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్లో భాగంగా రూ.1,500 తగ్గింపు ప్రకటించింది. సాంసంగ్ ఆఫర్ ఇంకా కొనసాగుతోంది. (image: Samsung India)
4. ప్రస్తుతం సాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు సాంసంగ్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంది. 4జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.15,999 ధరకు, 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.16,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.1,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. (image: Samsung India)
5. ఫ్లిప్‌కార్ట్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ ఆఫర్‌తో సాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ స్మార్ట్‌ఫోన్ 4జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.14,999 ధరకు, 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.15,999 ధరకు కొనొచ్చు. రూ.20,000 లోపు బడ్జెట్లో రిలీజైన ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.15,000 లోపు ధరకే కొనొచ్చు. ఇక ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో కొంటే 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. (image: Samsung India)
6. ఇక సాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల డిస్ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 4జీబీ+128జీబీ, 6జీబీ+128జీబీ వేరియంట్లలో రిలీజైంది. ర్యామ్ ప్లస్ ఫీచర్‌తో 6జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. (image: Samsung India)
7. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ Samsung JN1 ప్రైమరీ సెన్సార్ + 8మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండగా, సెల్ఫీలు, వీడియోకాల్స్ కోసం 8మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అయితే బాక్సులో ఛార్జర్ లభించదు. (image: Samsung India)