1. సాంసంగ్ ఇండియా మార్చిలో గెలాక్సీ ఏ సిరీస్‌లో సాంసంగ్ గెలాక్సీ ఏ53 5జీ (Samsung Galaxy A53 5G) మోడల్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. రెండు వేరియంట్ల ధరల్ని తగ్గించింది సాంసంగ్. ఈ స్మార్ట్‌ఫోన్ ధరను రూ.3,000 తగ్గించింది. రూ.35,000 లోపు బడ్జెట్లో రిలీజైన ఈ మొబైల్‌ను ఆఫర్‌తో రూ.30,000 లోపే కొనొచ్చు. (image: Samsung India)
2. రిలీజ్ అయినప్పుడు సాంసంగ్ గెలాక్సీ ఏ53 స్మార్ట్‌ఫోన్ ధరల్ని చూస్తే 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.34,499 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.35,999. ఇప్పుడు రూ.3,000 తగ్గింది. దీంతో 6జీబీ+128జీబీ వేరియంట్ రూ.31,499 ధరకు, 8జీబీ+128జీబీ వేరియంట్ రూ.32,999 ధరకు దిగొచ్చింది. (image: Samsung India)
3. అమెజాన్, ఎస్బీఐలో బ్యాంకు కార్డులతో సాంసంగ్ గెలాక్సీ ఏ53 5జీ స్మార్ట్‌ఫోన్ కొంటే మరింత డిస్కౌంట్ పొందొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.30,000 లోపే సొంతం చేసుకోవచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు సాంసంగ్ అధికారిక వెబ్సైట్లో కూడా కొనొచ్చు. ఆసమ్ బ్లూ, ఆసమ్ బ్లాక్, ఆసమ్ వైట్ కలర్స్‌లో అందుబాటులో ఉంది. (image: Samsung India)
4. సాంసంగ్ గెలాక్సీ ఏ53 స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల సూపర్ అమొలెడ్ డిస్ప్లే ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంది. ఎక్సినోస్ 1280 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ సాంసంగ్ గెలాక్సీ ఏ33, సాంసంగ్ గెలాక్సీ ఎం33 మొబైల్స్‌లో ఉంది. (image: Samsung India)
5. సాంసంగ్ గెలాక్సీ ఏ53 స్మార్ట్‌ఫోన్ కెమెరా డీటెయిల్స్ చూస్తే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్‌తో 64మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 12మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా + 5మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా + 5మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. (image: Samsung India)
6. సాంసంగ్ గెలాక్సీ ఏ53 స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ బాక్సులో రాదన్న విషయాన్ని కస్టమర్లు గుర్తుంచుకోవాలి. 25వాట్ ఫాస్ట్ ఛార్జర్‌ను వేరుగా కొనాల్సి ఉంటుంది. రెండురోజులపాటు బ్యాటరీ వస్తుందని కంపెనీ వెల్లడించింది. డాల్బీ అట్మాస్ సపోర్ట్, గేమ్ బూస్టర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Samsung India)