1. సాంసంగ్ ఇండియా గెలాక్సీ ఏ సిరీస్‌లో సాంసంగ్ గెలాక్సీ ఏ03 (Samsung Galaxy A03) లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్ రూ.12,000 లోపు సెగ్మెంట్లో రిలీజైంది. ఈ మొబైల్ ధరను తగ్గించింది సాంసంగ్. ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్ రూ.10,000 లోపు బడ్జెట్లోనే (Smartphone Under Rs 10,000) లభిస్తుండటం విశేషం. (image: Samsung India)
2. సాంసంగ్ గెలాక్సీ ఏ03 రెండు వేరియంట్లలో లభిస్తోంది. రిలీజ్ నాటి ధరలు చూస్తే 3జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,499 కాగా, 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,999. ధర తగ్గించిన తర్వాత 3జీబీ+32జీబీ వేరియంట్‌ను రూ.9,514 ధరకు, 4జీబీ+64జీబీ వేరియంట్‌ను రూ.11,014 ధరకు సొంతం చేసుకోవచ్చు. (image: Samsung India)
3. సాంసంగ్ గెలాక్సీ ఏ03 స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు సాంసంగ్ అధికారిక వెబ్సైట్లో కొనొచ్చు. ఆఫ్‌లైన్ మార్కెట్లో కూడా ఈ మొబైల్ లభిస్తోంది. బ్లూ, బ్లాక్, రెడ్ కలర్స్‌లో ఈ మొబైల్ కొనొచ్చు. రూ.10,000 లోపు సెగ్మెంట్లో రియల్మీ, రెడ్మీ, మోటోరోలా, మైక్రోమాక్స్ లాంటి మొబైల్స్‌కు సాంసంగ్ గెలాక్సీ ఏ03 పోటీ ఇస్తోంది. (image: Samsung India)
5. సాంసంగ్ గెలాక్సీ ఏ03 స్మార్ట్‌ఫోన్‌లో 48మెగాపిక్సెల్ + 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో డ్యూయెల్ రియర్ కెమెరా ఉండగా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 + సాంసంగ్ వన్ యూఐ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. (image: Samsung India)
6. సాంసంగ్ గెలాక్సీ ఏ03 కనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే ఇందులో 3.5ఎంఎం జాక్, బ్లూటూత్ 5.0, డ్యూయెల్ సిమ్, వైఫై లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. సాంసంగ్ గెలాక్సీ ఏ03 కన్నా తక్కువ ఫీచర్స్‌తో సాంసంగ్ గెలాక్సీ ఏ03 కోర్ మొబైల్ కూడా ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 11 గో ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. (image: Samsung India)