గెలాక్సీ S21 FE 5G (Galaxy S21 FE 5G) పేరుతో ఇది భారత మార్కెట్లోకి రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ లాంచింగ్‌పై (Smartphone launching) అధికారిక ప్రకటన చేసింది. జనవరి 11న దీన్ని భారతీయ మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ డివైజ్ ధర మాత్రం వెల్లడించలేదు. ఈ స్మార్ట్‌ఫోన్ కోసం రూ.999 టోకెన్ మొత్తాన్ని చెల్లించి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు. (image: Samsung India)
యూనిట్‌ను ప్రీ-రిజర్వ్ చేసుకున్న వారికి మొదటి ప్రాధాన్యతగా మొబైల్ డెలివరీ చేస్తారు. అంతేకాదు, ఆయా కస్టమర్లు ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా రూ. 2,699 విలువైన గెలాక్సీ స్మార్ట్‌ట్యాగ్ ట్రాకర్ యాక్సెసరీని దక్కించుకునే అవకాశం లభిస్తుంది. శామ్సంగ్ గెలాక్సీ S21 FE 5G స్మార్ట్‌ఫోన్‌ను శామ్సంగ్ ఇండియా ఈ-స్టోర్, http://www.samsung.com లేదా శామ్సంగ్ షాప్ యాప్‌ల ద్వారా ప్రీరిజర్వ్ చేసుకోవచ్చు. (image: Samsung India)
శామ్సంగ్ గెలాక్సీ S21 FE 5G స్పెసిఫికేషన్లు.. శామ్సంగ్ గెలాక్సీ S21 FE 5G ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌గా వస్తోంది. హై-ఎండ్ ఫీచర్లలో రానున్న ఈ స్మార్ట్‌ఫోన్ 6.4 -అంగుళాల 1080p AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 888 చిప్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. (image: Samsung India)
5జీ కనెక్టివిటీ, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, IP68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, వైర్లెస్ ఛార్జింగ్ వంటి అదిరిపోయే ఫీచర్లను అందించింది. దీనిలో ఆప్టికల్ ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను కూడా చేర్చింది. ఇది 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 12- ఆధారిత One UI 4.0 ఓఎస్‌పై పనిచేస్తుంది. (image: Samsung India)
బ్యాటరీ విషయానికి వస్తే.. దీనిలో 4,500mAh బ్యాటరీని అందించింది. ఇది 15W వైర్లెస్ ఛార్జింగ్‌కు మద్దతిస్తుంది. ఇక, దీని వెనుకవైపు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను చేర్చింది. వీటిలో 12 ఎంపీ మెయిన్ కెమెరా, 12 ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 8 ఎంపీ టెలిఫోటో కెమెరా, 30 ఎక్స్ సాఫ్ట్వేర్ ప్రేరిత "స్పేస్" జూమ్ కెమెరాలను అందించింది.(image: Samsung India)