1. సాంసంగ్ ఇండియా గెలాక్సీ ఎం సిరీస్‌లో సాంసంగ్ గెలాక్సీ ఎం33 5జీ (Samsung Galaxy M33 5G) స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. గతేడాది రిలీజైన సాంసంగ్ గెలాక్సీ ఎం32 అప్‌గ్రేడ్ వేరియంట్ ఇది. సాంసంగ్ గెలాక్సీ ఎం33 5జీ స్మార్ట్‌ఫోన్ సేల్ ఏప్రిల్ 8 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. అమెజాన్‌తో పాటు సాంసంగ్ అధికారిక వెబ్సైట్లో కొనొచ్చు. (image: Samsung India)
2. ఇండియాలో సాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్ స్మార్ట్ఫోన్లు బాగా పాపులర్ అయ్యాయి. సాంసంగ్ గెలాక్సీ ఎం33 5జీ స్మార్ట్‌ఫోన్‌లో ఎక్సినోస్ 1280 ప్రాసెసర్, 6,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 50మెగాపిక్సెల్ కెమెరా సెటప్ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే రూ.20,000 బడ్జెట్లో ఉన్న రెడ్మీ నోట్ 11టీ 5జీ, రియల్మీ 9 5జీ, పోకో ఎం4 ప్రో 5జీ స్మార్ట్ఫోన్లకు పోటీ ఇవ్వనుంది. (image: Samsung India)
3. సాంసంగ్ గెలాక్సీ ఎం33 5జీ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో రిలీజైంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,499. ఇంట్రడక్టరీ ఆఫర్ కింద రూ.1,000 డిస్కౌంట్ ప్రకటించింది సాంసంగ్. 6జీబీ వేరియంట్‌ను రూ.17,999 ధరకు, 8జీబీ వేరియంట్‌ను రూ.19,499 ధరకు కొనొచ్చు. (image: Samsung India)
5. సాంసంగ్ గెలాక్సీ ఎం33 5జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంది. ఎక్సినోస్ 1280 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. సాంసంగ్ గెలాక్సీ ఏ53 5జీ స్మార్ట్‌ఫోన్‌లో కూడా ఇదే ప్రాసెసర్ ఉంది. (image: Samsung India)
6. సాంసంగ్ గెలాక్సీ ఎం33 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 50మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 5మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ + 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. (image: Samsung India)