1. సాంసంగ్ ఇండియా నుంచి ఇటీవల మరో కొత్త మొబైల్ ఇండియాలో లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. సాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్‌లో సాంసంగ్ గెలాక్సీ ఎం04 (Samsung Galaxy M04) స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది కంపెనీ. ఈ మొబైల్ రూ.10,000 లోపు బడ్జెట్లో (Smartphone Under Rs 10000) రిలీజ్ కావడం విశేషం. (image: Samsung India)
2. ఇందులో 6.5 అంగుళాల డిస్ప్లే, 8జీబీ వరకు ర్యామ్, 128జీబీ వరకు స్టోరేజ్, 5,000mAh బ్యాటరీ, 13మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా సెటప్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. గతంలో రిలీజైన సాంసంగ్ గెలాక్సీ ఎం03 అప్‌గ్రేడ్ వర్షన్‌గా సాంసంగ్ గెలాక్సీ ఎం04 వచ్చింది. బేసిక్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్. (image: Samsung India)
3. సాంసంగ్ గెలాక్సీ ఎం04 ధర వివరాలు చూస్తే ఈ మొబైల్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,499 కాగా, 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,499. సేల్ ప్రారంభమైంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.1,000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈఎంఐ ఆప్షన్‌కు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. (image: Samsung India)
4. బ్యాంకు ఆఫర్స్‌తో సాంసంగ్ గెలాక్సీ ఎం04 కొంటే 4జీబీ+64జీబీ వేరియంట్‌ను రూ.8,499 ధరకు, 4జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.9,499 ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. రూ.600 లోపు ఈఎంఐతో ఈ స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు. మింట్ గ్రీన్, గోల్డ్, వైట్, బ్లూ కలర్స్‌లో లభిస్తుంది. (image: Samsung India)
5. సాంసంగ్ గెలాక్సీ ఎం04 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. బేసిక్ యూసేజ్ కోసం ఈ ప్రాసెసర్ పనితీరు సరిపోతుంది. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ సపోర్ట్ ఉంది. ర్యామ్ ప్లస్ ఫీచర్‌తో 8జీబీ వరకు ర్యామ్ ఉపయోగించుకోవచ్చు. మెమొరీ కార్డుతో 128జీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. (image: Samsung India)
7. సాంసంగ్ గెలాక్సీ ఎం04 మొబైల్లో ఆండ్రాయిడ్ 12 + వన్‌యూఐ 4.1 కోర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. సాంసంగ్ రెండేళ్ల ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్తామని ప్రకటించింది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్ కూడా ఉంది. 4జీ, డ్యూయెల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ లాంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. (image: Samsung India)
8. సాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్‌లో రూ.10,000 లోపు సాంసంగ్ గెలాక్సీ ఎం13 మోడల్ కూడా ఉంది. ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, ఎక్సినోస్ 850 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ కెమెరా, 6000ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Samsung India)