1. ఫ్లిప్‌కార్ట్‌లో మంత్ ఎండ్ మొబైల్ ఫెస్ట్ సేల్‌లో సాంసంగ్ గెలాక్సీ ఎఫ్22 (Samsung Galaxy F22) స్మార్ట్‌ఫోన్‌పై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆఫర్లో రూ.9,999 ధరకే సొంతం చేసుకోవచ్చు. రూ.10,000 లోపు బడ్జెట్లో సూపర్ అమొలెడ్ డిస్ప్లే, 6000ఎంఏహెచ్ బ్యాటరీ, 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ లాంటి ఫీచర్స్ ఉన్న స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు. (image: Samsung India)
2. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్22 స్మార్ట్‌ఫోన్ అసలు ధర చూస్తే 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999. ఆఫర్లో 4జీబీ+64జీబీ వేరియంట్‌ను రూ.9,999 ధరకు, 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.11,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. (image: Samsung India)
3. ఫ్లిప్‌కార్ట్‌లో మంత్ ఎండ్ మొబైల్ ఫెస్ట్ సేల్‌లో యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.1,250 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో కొంటే 5 శాతం అన్లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ద్వారా కొనాలనుకునేవారికి రూ.11,450 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈఎంఐ ద్వారా కొనాలనుకుంటే రూ.2,000 నుంచి నోకాస్ట్ ఈఎంఐ ఆప్షన్ అందుబాటులో ఉంది. (image: Samsung India)
4. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్22 స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.4 హెచ్డీ+ సూపర్ అమొలెడ్ ఇన్ఫినిటీ యూ డిస్ప్లే ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ వివో వై33ఎస్, వివో వై53ఎస్ లాంటి స్మార్ట్ఫోన్లలో ఉంది. (image: Samsung India)
5. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్22 స్మార్ట్‌ఫోన్‌లో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా + 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో వెనుకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. (image: Samsung India)