స్పెసిఫికేషన్స్
శామ్సంగ్ గెలాక్సీ F14 స్మార్ట్‌ఫోన్ 90Hz రిఫ్రెష్ రేటు, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో 6.6 అంగుళాల ఫుల్ HD+ డిస్ప్లేతో లభిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 13 బేస్డ్ One UI 5 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. ఈ హ్యాండ్సెట్ ఈక్వినాక్స్ 1330 SoC చిప్సెట్తో పనిచేస్తుంది. ఈ ఫోన్లో రియర్ డ్యుయల్ కెమెరా సెటప్ (50 MP+2 MP) ఉంటుంది. ఫోన్ ముందు భాగంలో 13MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. (ప్రతీకాత్మక చిత్రం)
బ్యాటరీ, కనెక్టివిటీ ఫీచర్లు
గెలాక్సీ F14 ఫోన్లో 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 6000mAh బ్యాటరీ, యూఎస్బీ-సీ పోర్ట్, 3.5mm జాక్, బ్లూటూత్ 5.2, ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. కొత్త 5G స్మార్ట్‌ఫోన్ గతేడాది వచ్చిన గెలాక్సీ F13 మాదిరిగా కనిపిస్తున్నా.. కొన్ని మైనర్ మార్పులు ఇందులో ఉన్నాయి. తాజా ఫోన్లో రౌండ్ కెమెరా మాడ్యూల్స్ ఉండగా, గెలాక్సీ F13లో రియర్ కెమెరా సెటప్ దీర్ఘచతురస్రాకార డెక్‌లో ఉన్నాయి. ఇక సెల్ఫీ కెమెరా కోసం ఫ్రంట్ ప్యానెల్ గత ఫోన్లో మాదిరి వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌తో ఉంది. శామ్సంగ్ కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌లో రెండు సంవత్సరాల వరకు ఆండ్రాయిడ్ అప్డేట్లను ఆఫర్ చేయనుంది.
ధర వివరాలు
గతేడాది వచ్చిన శామ్సంగ్ గెలాక్సీ F13కి సక్సెర్గా గెలాక్సీ F14 5G మోడల్‌ను రెండు వేరియంట్లలో కంపెనీ తాజాగా లాంచ్ చేసింది. దిగ్గజ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో లిస్ట్ అయిన వివరాల ప్రకారం.. ఈ ఫోన్ బేస్ వేరియంట్ (4GB RAM +128GB స్టోరేజ్) ధర రూ.14,490 కాగా, మరో వేరియంట్ (6GB RAM+128GB స్టోరేజ్) ధర రూ.15,990గా ఉంది.