Samsung Galaxy F12: సాంసంగ్ గెలాక్సీ ఎఫ్12 స్మార్ట్‌ఫోన్‌లో 48 మెగాపిక్సెల్ ISOCELL GM2 ప్రైమరీ సెన్సార్ + 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్‌తో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్. (image: Samsung India)
Samsung Galaxy F12: సాంసంగ్ గెలాక్సీ ఎఫ్12 స్మార్ట్‌ఫోన్‌లో 6000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 15వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 11 + వన్‌యూఐ 3.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్12 స్మార్ట్‌ఫోన్‌ను సెలెస్టియల్ బ్లాక్, స్కై బ్లూ, సీ గ్రీన్ కలర్స్‌లో కొనొచ్చు. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్12 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.9,999 కాగా, 4జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.10,999. (image: Samsung India)
Realme C25: రియల్మీ సీ25 బ్యాటరీ 6,000ఎంఏహెచ్. 18వాట్ టైప్ సీ క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 11 + రియల్మీ యూఐ 2.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. డ్యూయెల్ సిమ్ + ఎస్డీ కార్డ్ సపోర్ట్ చేస్తుంది. వాటరీ బ్లూ, వాటరీ గ్రే కలర్స్‌లో కొనొచ్చు. 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.9,999 కాగా, 4జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.10,999. (image: Realme India)
Samsung Galaxy F02s: సాంసంగ్ గెలాక్సీ ఎఫ్02ఎస్ బ్యాటరీ 5,000ఎంఏహెచ్. 15వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 10 + వన్‌యూఐ కోర్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. డ్యూయెల్ సిమ్ సపోర్ట్ చేస్తుంది. బ్లాక్, వైట్, బ్లూ కలర్స్‌లో కొనొచ్చు. 3జీబీ+32జీబీ వేరియంట్ ధర రూ.8,999 కాగా 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.9,999. (image: Samsung India)
Realme Narzo 30A: రియల్మీ నార్జో 30ఏ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 10 + రియల్మీ యూఐ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. డ్యూయెల్ సిమ్ సపోర్ట్ ఉంది. లేజర్ బ్లాక్, లేజర్ బ్లూ కలర్స్‌లో కొనొచ్చు. రియల్మీ నార్జో 30ఏ స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ ధర రూ.8,999 కాగా, 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.9,999. (image: Realme India)
Poco M3: పోకో ఎం3 విశేషాలు చూస్తే ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో ఉన్న పోకో ఎం2 అప్‌గ్రేడ్ వర్షన్ ఇది. ఇండియాలో పోకో ఎం2 బాగా పాపులర్ అయింది. దీంతో పోకో ఎం3 స్మార్ట్‌ఫోన్‌పై అంచనాలు పెరిగాయి. పోకో ఎం3 ఎల్లో, బ్లూ, బ్లాక్ కలర్స్‌లో రిలీజైంది. లెదర్ లాంటి టెక్చర్డ్ డిజైన్ ఆకట్టుకుంటోంది. పోకో ఎం3 స్మార్ట్‌ఫోన్‌లో 6.53 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉండటం విశేషం. (image: Poco India)
Poco M3: పోకో ఎం3 స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. పోకో ఎం3 స్మార్ట్‌ఫోన్‌లో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెటప్ ఉన్నాయి. పోకో ఎం3 స్మార్ట్‌ఫోన్‌లో 6,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉండటం విశేషం. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. (image: Poco India)
Samsung Galaxy M12: సాంసంగ్ లేటెస్ట్గా గెలాక్సీ ఎం సిరీస్‌లో గెలాక్సీ ఎం12 మోడల్ రిలీజ్ చేసింది. సాంసంగ్ ఎక్సినోస్ 850 ప్రాసెసర్, 6,000ఎంఏహెచ్ బ్యాటరీ, 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ లాంటి ప్రత్యేకతలున్నాయి. 4జీబీ+64జీబీ ధర రూ.10,999 కాగా, 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.13,499. ఆఫర్లో కొంటే రూ.1,000 తగ్గుతుంది కాబట్టి 4జీబీ+64జీబీ వేరియంట్‌ను రూ.9,999 ధరకే కొనొచ్చు.
Samsung Galaxy M12: సాంసంగ్ గెలాక్సీ ఎం12 స్పెసిఫికేషన్స్ చూస్తే 6.5 అంగుళాల హెచ్డీ+ టీఎఫ్టీ ఇన్ఫినిటీ వీ డిస్ప్లే ఉంది. సాంసంగ్ ఎక్సినోస్ 850 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. బ్యాటరీ 6,000ఎంఏహెచ్. ఆండ్రాయిడ్ 11 + వన్‌యూఐ 3.1 కోర్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. డ్యూయెల్ సిమ్ సపోర్ట్ చేస్తుంది.
Samsung Galaxy M12: సాంసంగ్ గెలాక్సీ ఎం12 స్మార్ట్‌ఫోన్‌లో వెనుకవైపు 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 5 మెగాపిక్సెల్ సెకండరీ అల్ట్రావైడ్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ సెటప్ ఉండగా 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. అట్రాక్టీవ్ బ్లాక్, ఎలిగెంట్ బ్లూ, ట్రెండీ ఎమరాల్డ్ గ్రీన్ కలర్స్‌లో కొనొచ్చు.
Moto E7 Power: మోటోరోలా నుంచి ఇటీవల రిలీజ్ అయిన మోడల్ మోటో ఈ7 పవర్. ఇది బడ్జెట్ స్మార్ట్‌ఫోన్. బేసిక్ ఫీచర్స్ ఉంటాయి. 5,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్, 13 మెగాపిక్సెల్ డ్యూయెల్ సిమ్ సెటప్ లాంటి ప్రత్యేకతలున్నాయి. కెమెరాలో పోర్ట్రైట్ మోడ్, పనోరమా, ఫేస్ బ్యూటీ, మ్యాక్రో విజన్, మ్యాన్యువల్ మోడ్, హెచ్డీఆర్ లాంటి ప్రత్యేకతలున్నాయి. కెమెరాలో గూగుల్ లెన్స్ ఇంటిగ్రేషన్ కూడా ఉంది. (image: Motorola India)
Moto E7 Power: మోటో ఈ7 పవర్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.5 అంగుళాల హెచ్డీ+ మ్యాక్స్ విజన్ డిస్ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. మోటో ఈ7 పవర్ స్మార్ట్‌ఫోన్‌లో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ రియర్ కెమెరా సెటప్ ఉండగా, ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 10వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. (image: Motorola India)
Moto E7 Power: మోటో ఈ7 పవర్ స్మార్ట్‌ఫోన్‌ను కోరల్ రెడ్, తైతీ బ్లూ కలర్స్‌లో కొనొచ్చు. 2జీబీ+32జీబీ వేరియంట్ ధర రూ.7,499 కాగా 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.8,299. అయితే 2జీబీ+32జీబీ వేరియంట్ కొనడం కన్నా రూ.800 ఎక్కువ చెల్లిస్తే 4జీబీ+64జీబీ స్మార్ట్‌ఫోన్ వస్తుంది. మోటో ఈ7 పవర్ స్టాక్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్. ఇందులో గూగుల్ యాప్స్ మాత్రమే ఉంటాయి. థర్డ్ పార్టీ యాప్స్, బ్లోట్ వేర్ ఉండదు. రెండేళ్ల పాటు ఆండ్రాయిడ్, సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి. (image: Motorola India)