1. సాంసంగ్ ఇండియా గెలాక్సీ ఏ సిరీస్‌లో సాంసంగ్ గెలాక్సీ ఏ73 5జీ (Samsung Galaxy A73 5G) లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్ ధరను రూ.4,000 తగ్గించింది కంపెనీ. దసరా, దీపావళి సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకొని కొనలేకపోయినవారికి మంచి అవకాశం అందిస్తోంది సాంసంగ్. అదనంగా ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. (image: Samsung India)
3. ధర తగ్గిన తర్వాత సాంసంగ్ గెలాక్సీ ఏ73 5జీ స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.37,999 ధరకు, 8జీబీ+256జీబీ వేరియంట్‌ను రూ.40,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. సాంసంగ్ షాప్ యాప్‌లో మొదటిసారి షాపింగ్ చేసేవారికి సాంసంగ్ స్మార్ట్క్లబ్ వెల్కమ్ ఓచర్ లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ద్వారా కొనేవారికి రూ.2,000 ఎక్స్ఛేంజ్ బోనస్ అందిస్తుంది. (image: Samsung India)
5. సాంసంగ్ గెలాక్సీ ఏ73 5జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఉంది. 8జీబీ+128జీబీ, 8జీబీ+256జీబీ వేరియంట్లలో రిలీజైంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. (image: Samsung India)
6. సాంసంగ్ గెలాక్సీ ఏ73 5జీ స్మార్ట్‌ఫోన్ కెమెరా ఫీచర్స్ చూస్తే ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్‌తో 108మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 12మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా + 5మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ + 5మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32మెగాపిక్సెల్ కెమెరా ఉంది. (image: Samsung India)
7. సాంసంగ్ గెలాక్సీ ఏ73 5జీ స్మార్ట్‌ఫోన్‌లో ర్యామ్ ప్లస్ ఫీచర్ ఉంది. 16జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. ఇక మైక్రోఎస్డీ కార్డుతో 1టీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. నాలుగేళ్ల ఆండ్రాయిడ్ ఓఎస్ అప్డేట్స్ ఇస్తామని కంపెనీ చెబుతోంది. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. (image: Samsung India)