1. సాంసంగ్ నుంచి ఇటీవల గెలాక్సీ ఏ సిరీస్‌లో కొత్త స్మార్ట్ఫోన్లు రిలీజ్ అయ్యాయి. సాంసంగ్ గెలాక్సీ ఏ13, సాంసంగ్ గెలాక్సీ ఏ23, సాంసంగ్ గెలాక్సీ ఏ33 5జీ, సాంసంగ్ గెలాక్సీ ఏ53 5జీ మోడల్స్ రిలీజ్ అయ్యాయి. వీటితో పాటు ప్రీమియం సెగ్మెంట్లో సాంసంగ్ గెలాక్సీ ఏ73 5జీ (Samsung Galaxy A73 5G) మోడల్ రిలీజైంది. (image: Samsung India)
2. సాంసంగ్ గెలాక్సీ ఏ73 5జీ స్మార్ట్‌ఫోన్ సేల్ ప్రారంభమైంది. సాంసంగ్ గెలాక్సీ ఏ73 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 120Hz అమొలెడ్ డిస్ప్లే, 108మెగాపిక్సెల్ కెమెరా సెటప్, 5జీ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. కస్టమర్లు సాంసంగ్ వెబ్సైట్లో ప్రీ-ఆర్డర్ ద్వారా బుక్ చేయొచ్చు. ప్రీ-ఆర్డర్ ద్వారా కొనేవారికి అనేక ఆసక్తికరమైన ఆఫర్స్ ఉన్నాయి. (image: Samsung India)
3. సాంసంగ్ గెలాక్సీ ఏ73 5జీ స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.41,999 కాగా, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.44,999. ఈ స్మార్ట్‌ఫోన్ కొనేవారికి రూ.6,990 విలువైన గెలాక్సీ బడ్స్ లైవ్ రూ.499 ధరకే సొంతం చేసుకోవచ్చు. సాంసంగ్ ఫైనాన్స్+, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్స్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్‌తో కొంటే రూ.3,000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. (image: Samsung India)
4. ఫ్లిప్‌కార్ట్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, క్రెడిట్, డెబిట్ ఈఎంఐ ద్వారా కొంటే రూ.3,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో కూడా రూ.6,990 విలువైన గెలాక్సీ బడ్స్ లైవ్ రూ.499 ధరకే సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈఎంఐ ద్వారా కొనాలనుకునేవారికి రూ.7,000 నుంచి ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి. (image: Samsung India)
5. సాంసంగ్ గెలాక్సీ ఏ73 5జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఉంది. 8జీబీ+128జీబీ, 8జీబీ+256జీబీ వేరియంట్లలో రిలీజైంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ రియల్మీ 9 ఎస్ఈ, సాంసంగ్ గెలాక్సీ ఎం52, రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్, ఐకూ జెడ్5, షావోమీ 11 లైట్ ఎన్ఈ, మోటోరోలా ఎడ్జ్ 20 స్మార్ట్ఫోన్లలో ఉంది. (image: Samsung India)
6. సాంసంగ్ గెలాక్సీ ఏ73 5జీ స్మార్ట్‌ఫోన్ కెమెరా ఫీచర్స్ చూస్తే ఇందులో ఆప్టికల్ ఇమేజె స్టెబిలైజేషన్ ఫీచర్‌తో 108మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 12మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా + 5మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ + 5మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ఆబ్జెక్ట్ ఎరేజర్, ఫోటో రీమాస్టర్, పోర్ట్రైట్ మోడ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32మెగాపిక్సెల్ కెమెరా ఉంది. (image: Samsung India)
7. సాంసంగ్ గెలాక్సీ ఏ73 5జీ స్మార్ట్‌ఫోన్‌లో ర్యామ్ ప్లస్ ఫీచర్ ఉంది. 16జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. ఇక మైక్రోఎస్డీ కార్డుతో 1టీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. నాలుగేళ్ల ఆండ్రాయిడ్ ఓఎస్ అప్డేట్స్ ఇస్తామని కంపెనీ చెబుతోంది. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. (image: Samsung India)