Samsung Galaxy F42: సాంసంగ్ గెలాక్సీ F42 ఫోన్ ధర ఇండియాలో రూ.3,000 తగ్గింది. స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. 6GB RAM వేరియంట్ ధరను రూ.17,999కి తగ్గించింది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ బేస్డ్ శామ్సంగ్ వన్ UI 3.1 పై రన్ అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
OnePlus Nord CE 2 Lite: వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్ ధర రూ.1,000 తగ్గింది. ఈ ఫోన్ ఏప్రిల్‌లో రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 6GB వేరియంట్ ధర రూ.19,999కాగా, 8GB వేరియంట్ ధర రూ.21,999గా ఉంది. తాజా ధర తగ్గింపు తర్వాత 6GB RAM మోడల్‌ను రూ.18,999కు, 8GB RAM వేరియంట్‌ను రూ.20,999కి సొంతం చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
Samsung Galaxy A53 5G: సాంసంగ్ గెలాక్సీ A53 5G స్మార్ట్‌ఫోన్ 6GB, 8GB వేరియంట్లలో లభిస్తుంది. ధర తగ్గింపు తర్వాత, 6GB వేరియంట్ రూ.31,999కి అందుబాటులో ఉంది. 8GB RAM వేరియంట్ ధర ఇప్పుడు రూ.32,999గా ఉంది. బ్లాక్, ఆసమ్ బ్లూ, ఆసమ్ పీచ్, ఆసమ్ వైట్ కలర్స్‌లో ఫోన్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
Samsung Galaxy A03: సాంసంగ్ గెలాక్సీ A03 ఈ సంవత్సరం ప్రారంభంలో రూ.10,499 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ఇది రెండు RAM మోడల్స్- 3GB, 4GBలో అందుబాటులో ఉంది. 3GB RAM వేరియంట్ ధర రూ.9,514గా, 4GB RAM మోడల్ ధర రూ.11,014గా ఉంది. హ్యాండ్సెట్లు బ్లూ, బ్లాక్, రెడ్ కలర్ వేరియంట్లలో లభిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
Samsung Galaxy F22: సాంసంగ్ గెలాక్సీ F22 ఫోన్ ధర రూ.2000 తగ్గింది. ఫోన్ 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ రూ.10,499కి లభిస్తోంది. అయితే 6GB RAM + 128GB స్టోరేజ్ మోడల్‌ను ఇప్పుడు రూ.12,499కి కొనుగోలు చేయవచ్చు. హ్యాండ్సెట్ 6.4-అంగుళాల HD+ సూపర్ AMOLED ఇన్ఫినిటీ-U డిస్ప్లేతో వస్తుంది, 90Hz రిఫ్రెష్ రేట్ అందిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
Vivo V23e 5G: రూ.1,000 ధర తగ్గింపు తర్వాత, వివో V23e 5G ఇప్పుడు రూ.24,990కి లభిస్తుంది. డివైజ్ ఒకే వేరియంట్లో 128GB ఇంటర్నల్ స్టోరేజ్, 8GB RAMతో వస్తుంది. హ్యాండ్సెట్ MediaTek డైమెన్సిటీ 810 చిప్సెట్, వర్చువల్ మెమరీ ఫీచర్‌ను అందిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ బేస్డ్ ఓన్ ఫన్‌టచ్ OSపై రన్ అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
Vivo Y21T: వివో Y21Tపై రూ.1,000 ధర తగ్గింపు లభించింది. 4GB RAM+128GB స్టోరేజ్ మోడల్‌ను ఇప్పుడు రూ.15,499కి సొంతం చేసుకోవచ్చు. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ఆక్టా-కోర్ ప్రాసెసర్, 6.58-అంగుళాల ఫుల్HD+ LCD డిస్ప్లే ఫీచర్లు ఉన్నాయి. మిడ్నైట్ బ్లూ, పెరల్ వైట్ అనే రెండు కలర్ ఆప్షన్లలో ఫోన్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
Oppo Reno 7 Pro: ఒప్పో రెనో 7 ప్రో ధర రూ.3,000 తగ్గింది. ఈ స్మార్ట్‌ఫోన్ 2021 ఆగస్టులో రూ.39,999 ధరతో లాంచ్ అయింది. ఇప్పుడు రూ.36,999కి కొనుగోలు చేయవచ్చు. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 1200-Max ఆక్టా-కోర్ ప్రాసెసర్, f/1.8 ఎపర్చరుతో 50MP సోనీ IMX766 ప్రైమరీ సెన్సార్, f/2.2 ఎపర్చరుతో 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, f/2.4 మాక్రో ఎపర్చరుతో 2MP సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)