1. సాంసంగ్ గెలాక్సీ ఏ సిరీస్‌లో ఇండియాలో రిలీజైన సాంసంగ్ గెలాక్సీ ఏ53 (Samsung Galaxy A53) స్మార్ట్‌ఫోన్ సేల్ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు సాంసంగ్ ఇండియా ఇ-స్టోర్‌లో ప్రారంభమైంది. సాంసంగ్ గెలాక్సీ ఏ53 స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.34,499. ఈ స్మార్ట్‌ఫోన్ కొనేవారికి రూ.3,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. (image: Samsung India)
2. కెమెరాకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారిని దృష్టిలో పెట్టుకొని సాంసంగ్ ఈ స్మార్ట్‌ఫోన్ రూపొందించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరా, 5జీ కనెక్టివిటీ, నాక్స్ సెక్యూరిటీ, సరికొత్త ప్రాసెసర్, రెండు రోజుల బ్యాటరీ లైఫ్ లాంటి ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉన్నాయి. దాదాపు ఇవే ఫీచర్స్‌తో ఏ సిరీస్‌లో ఏ33, ఏ73 మోడల్స్ కూడా రిలీజ్ అయ్యాయి. (image: Samsung India)
3. సాంసంగ్ గెలాక్సీ ఏ53 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.34,499 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.35,999. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్, క్రెడిట్ ఈఎంఐ, డెబిట్ ఈఎంఐ ద్వారా కొంటే రూ.3,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 5 శాతం అన్లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. (image: Samsung India)
5. సాంసంగ్ గెలాక్సీ ఏ53 స్మార్ట్‌ఫోన్ కెమెరా డీటెయిల్స్ చూస్తే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్‌తో 64మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 12మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా + 5మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా + 5మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కెమెరాలు పనిచేస్తాయి. (image: Samsung India)
6. సాంసంగ్ గెలాక్సీ ఏ53 స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ బాక్సులో రాదన్న విషయాన్ని కస్టమర్లు గుర్తుంచుకోవాలి. 25వాట్ ఫాస్ట్ ఛార్జర్‌ను వేరుగా కొనాల్సి ఉంటుంది. రెండురోజులపాటు బ్యాటరీ వస్తుందని కంపెనీ వెల్లడించింది. డాల్బీ అట్మాస్ సపోర్ట్, గేమ్ బూస్టర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Samsung India)
7. సాంసంగ్ గెలాక్సీ ఏ53 స్మార్ట్‌ఫోన్‌లో ఆండ్రాయిడ్ 12 + వన్‌యూఐ 4.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. నాలుగేళ్ల పాటు ఓఎస్ అప్డేట్స్ ఇస్తామని కంపెనీ చెబుతోంది. ఇందులో సాంసంగ్ నాక్స్ సెక్యూరిటీ ఫీచర్ కూడా ఉంది. 5 ఏళ్లపాటు సెక్యూరిటీ సపోర్ట్ ఇస్తామని కంపెనీ చెబుతోంది. లైట్ బ్లూ, ఆసమ్ బ్లాక్, వైట్, ఆరెంజ్ కలర్స్‌లో కొనొచ్చు. (image: Samsung India)