1. సాంసంగ్ గెలాక్సీ ఏ సిరీస్‌లో ఇటీవల మూడు స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేసింది. సాంసంగ్ గెలాక్సీ ఏ33 5జీ (Samsung Galaxy A33 5G), గెలాక్సీ ఏ53 5జీ, గెలాక్సీ ఏ73 5జీ మోడల్స్‌ను పరిచయం చేసింది. వీటిలో సాంసంగ్ గెలాక్సీ ఏ33 సేల్ లేటెస్ట్గా ప్రారంభమైంది. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు సాంసంగ్ అధికారిక వెబ్సైట్లో కొనొచ్చు. (image: Samsung India)
2. సాంసంగ్ గెలాక్సీ ఏ33 5జీ గత నెలలో రిలీజైనా ధర వివరాలను సస్పెన్స్‌గా ఉంచింది సాంసంగ్. ఇప్పుడు ధరతో పాటు ఆఫర్లను వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో రిలీజైంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.28,499 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999. (image: Samsung India)
3. ఫ్లిప్‌కార్ట్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) క్రెడిట్ కార్డ్, క్రెడిట్, డెబిట్ ఈఎంఐ ద్వారా కొంటే రూ.1,500 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్‌తో సాంసంగ్ గెలాక్సీ ఏ33 5జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.26,999 ధరకు, 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.28,499 ధరకు సొంతం చేసుకోవచ్చు. (image: Samsung India)
4. ఫ్లిప్‌కార్ట్‌లో సాంసంగ్ గెలాక్సీ ఏ33 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో (Flipkart Axis Bank Credit Card) కొంటే 5 శాతం అన్లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈఎంఐ ద్వారా కొనాలనుకునేవారికి రూ.975 నుంచి ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి. ఆసమ్ బ్లాక్, ఆసమ్ బ్లూ, ఆసమ్ పీచ్, ఆసమ్ వైట్ కలర్స్‌లో కొనొచ్చు. (image: Samsung India)
5. సాంసంగ్ గెలాక్సీ ఏ33 5జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.4 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమొలెడ్ డిస్ప్లే ఉంది. ఎక్సినోస్ 1280 ప్రాసెసర్‌తో (Exynos 1280 processor) పనిచేస్తుంది. ఇటీవల రిలీజైన సాంసంగ్ గెలాక్సీ ఎం33 స్మార్ట్‌ఫోన్‌లో కూడా ఇదే ప్రాసెసర్ ఉంది. (image: Samsung India)
6. సాంసంగ్ గెలాక్సీ ఏ33 5జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ వేరియంట్లలో రిలీజైంది. మైక్రోఎస్డీ కార్డుతో 128జీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ బాక్సులో రాదు. ఈ స్మార్ట్‌ఫోన్ కొన్నవారు ఛార్జర్ ప్రత్యేకంగా కొనాల్సి ఉంటుంది. ఆండ్రాయిడ్ 12 + వన్ యూఐ 4.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. (image: Samsung India)
7. సాంసంగ్ గెలాక్సీ ఏ33 5జీ స్మార్ట్‌ఫోన్‌లో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేన్ (OIS) ఫీచర్‌తో 48మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 8మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా + 5మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ + 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో వెనుకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. (image: Samsung India)