1. సాంసంగ్ ఇండియా ఇటీవల సాంసంగ్ గెలాక్సీ ఏ14 5జీ (Samsung Galaxy A14 5G) స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో (Amazon Great Republic Day Sale) సాంసంగ్ గెలాక్సీ ఏ14 5జీ మొబైల్ సేల్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.1,000 ఈఎంఐ ఆఫర్‌తో లభిస్తుంది. (image: Samsung India)
2. సాంసంగ్ గెలాక్సీ ఏ14 5జీ స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో లభిస్తోంది. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,499 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.20,999. బ్లాక్, డార్క్ రెడ్, లైట్ గ్రీన్ కలర్స్‌లో కొనొచ్చు. (image: Samsung India)
4. సాంసంగ్ గెలాక్సీ ఏ14 5జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఇన్ఫినిటీ వీ డిస్ప్లే ఉంది. ఎక్సినోస్ 1330 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్‌తో రిలీజైన మొదటి మొబైల్ ఇదే. ఇందులో 8జీబీ ర్యామ్ వరకు సపోర్ట్, 128జీబీ వరకు స్టోరేజ్ సపోర్ట్ లభిస్తుంది. (image: Samsung India)