1. సాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ (Samsung Galaxy A52s) స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఈ స్మార్ట్‌ఫోన్ ధర భారీగా తగ్గింది. సాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ 5జీ స్మార్ట్‌ఫోన్ ధర వివరాలు చూస్తే 6జీబీ ర్యామ్ + 128జీబీ వేరియంట్ ధర రూ.35,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ వేరియంట్ ధర రూ.37,499. ఈ రెండు వేరియంట్లపై రూ.5,000 తగ్గింపు ప్రకటించింది కంపెనీ. (image: Samsung India)
2. తగ్గింపు తర్వాత సాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ 5జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.30,999 ధరకు, 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.32,499 ధరకు సొంతం చేసుకోవచ్చు. అయితే ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనేవారికే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఆన్లైన్లో ధరలు చూస్తే 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.35,999 కాగా, 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.37,499 ధరలకే సాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ 5జీ లభిస్తోంది. (image: Samsung India)
3. రూ.40,000 లోపు బడ్జెట్లో సాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజైన సంగతి తెలిసిందే. ఇందులో ఇటీవల బాగా పాపులర్ అయిన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్ ఉంది. దీంతో పాటు 64 మెగాపిక్సెల్ కెమెరా సెటప్, 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. (image: Samsung India)
4. సాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ 5జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమొలెడ్ ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే ఉంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండటం విశేషం. 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ లభిస్తుంది. మెమొరీ కార్డుతో 1టీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. (image: Samsung India)
5. సాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ లాంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. 12 5జీ బ్యాండ్స్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 11 + వన్‌ప్లస్ యూఐ 3.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. మూడేళ్ల పాటు ఓఎస్ అప్‌గ్రేడ్స్ ఇస్తామని కంపెనీ ప్రకటించింది. (image: Samsung India)
6. సాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లెన్స్‌తో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్ + 5 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ + 5 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్‌తో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. (image: Samsung India)