1. దసరా, దీపావళి సేల్‌లో స్మార్ట్ టీవీ కొనాలనుకొని కొనలేకపోయినవారికి మరో ఛాన్స్ వచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఎలక్ట్రానిక్స్ సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌లో స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. స్మార్ట్ టీవీలపై ఏకంగా 75 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. దీంతో పాటు ఎస్బీఐ కార్డుతో కొనేవారికి 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. (image: iFFALCON)
2. టీసీఎల్‌కు చెందిన ఇఫాల్కన్ స్మార్ట్ టీవీపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఇఫాల్కన్ బ్రాండ్‌కు చెందిన 55 అంగుళాల 4కే స్మార్ట్ టీవీ ఎంఆర్పీ రూ.73,990. ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్‌లో 63 శాతం తగ్గింపు లభిస్తోంది. దీంతో ఆఫర్ ధర రూ.26,999 కి చేరుకుంది. ఇక బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఎస్బీఐ కార్డ్, ఫెడరల్ బ్యాంక్ కార్డులతో కొనేవారికి 10 శాతం తగ్గింపు లభిస్తుంది. (image: iFFALCON)
4. ఇఫాల్కన్ 55 అంగుళాల 4కే స్మార్ట్ టీవీ ఫీచర్స్ చూస్తే ఇది యూ62 మోడల్ స్మార్ట్ టీవీ. గతేడాది లాంఛ్ అయిన స్మార్ట్ టీవీ. 55 అంగుళాల ఎల్ఈడీ స్క్రీన్ ఉంటుంది. 178 డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్ ఉంటుందని కంపెనీ చెబుతోంది. 60Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అల్ట్రా హెచ్డీ అంటే 4కే సపోర్ట్ లభిస్తుంది. గూగుల్ టీవీ ఓఎస్‌తో పనిచేస్తుంది. (image: iFFALCON)
5. ఇఫాల్కన్ 55 అంగుళాల 4కే స్మార్ట్ టీవీలో 3 హెచ్డీఎంఐ పోర్ట్స్, 1 యూఎస్బీ పోర్ట్, బిల్ట్ ఇన్ వైఫై లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో 2 స్పీకర్స్ ఉంటాయి. 24వాట్ సౌండ్ ఔట్పుట్ లభిస్తుంది. 2జీబీ ర్యామ్ సపోర్ట్‌తో స్మార్ట్ టీవీ పనిచేస్తుంది. నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, డిస్నీ+ హాట్‌స్టార్, ప్రైమ్ వీడియో లాంటి యాప్స్ సపోర్ట్ లభిస్తుంది. (image: iFFALCON)