1. ఒప్పో ఇండియా లేటెస్ట్గా రిలీజ్ చేసిన ఒప్పో ఏ57 (Oppo A57) స్మార్ట్‌ఫోన్ సేల్ మొదలైంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. రూ.15,000 లోపు బడ్జెట్లో ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్లో అందుబాటులో ఉంది. ధర రూ.13,999. (image: Oppo India)
2. ఒప్పో ఏ57 స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో కొనొచ్చు. అమెజాన్‌లో స్టాండర్డ్ చార్టర్డ్ క్రెడిట్ కార్డుతో కొంటే 7.5 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్, యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 5 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్, హెచ్ఎస్బీసీ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్తో 7.5 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్, హెచ్ఎస్బీసీ క్యాష్‌బ్యాక్ కార్డుతో కొంటే 5 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. (image: Oppo India)
3. ఫ్లిప్‌కార్ట్‌లో ఏయూ స్మాల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, వన్ కార్డ్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, కొటక్ బ్యాంక్, ఎస్బీఐ క్రెడిట్ కార్డులతో కొంటే 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో కొంటే 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. (image: Oppo India)
4. ఒప్పో ఏ57 స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. అమెజాన్‌లో రూ.13,100 వరకు, ఫ్లిప్‌కార్ట్‌లో రూ.12,500 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. మీ పాత మొబైల్‌కు ఎక్కువ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తే కేవలం రూ.2,000 లోపు చెల్లించి ఒప్పో ఏ57 స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు. (image: Oppo India)
5. ఒప్పో ఏ57 స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 6.56 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 4జీబీ+64జీబీ వేరియంట్లో మాత్రమే లభిస్తోంది. 4జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. మెమొరీ కార్డుతో 1టీబీ స్టోరేజ్ పెంచుకోవచ్చు. (image: Oppo India)
6. ఒప్పో ఏ57 స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయెల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో వెనుకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. రియర్, ఫ్రంట్ కెమెరాల్లో వీడియో, ఫోటో, పోర్ట్రైట్, టైమ్‌ల్యాప్స్, పనో, స్టిక్కర్ ఫీచర్స్ ఉన్నాయి. రియర్ కెమెరాలో నైట్ ఫీచర్ అదనంగా ఉంది. (image: Oppo India)