ఈ బైక్ బ్యాటరీని.. ఫ్రేమ్‌లో సెట్ చేశారు. అది 36 వోల్ట్ల పవర్‌తో ఉంది. అందువల్ల ఒకసారి ఛార్జ్ చేస్తే.. 32 కిలోమీటర్ల వరకూ వెళ్లొచ్చు. ఈ బైక్‌ని పెడల్స్ తొక్కుతూ వెళ్తే... 38 కిలోమీటర్ల దూరం వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఈ బ్యాటరీని బైక్ నుంచి విడదీసే ఛాన్స్ లేదు. ఈ బైక్‌కి 5 రకాల వేగ పరిమితులు ఉన్నాయి. తద్వారా ఎత్తైన ప్రదేశాల్లో కూడా బైక్ పైకి ఈజీగా వెళ్లేందుకు వీలుగా ఉంది. ఈ బైక్ వెళ్లేటప్పుడు స్పీడ్ ఎంతో తెలుసుకునేందుకు హ్యాండిల్‌బార్‌పై కాంపాక్ట్ LCD డిస్ప్లే ఉంది.