1. స్మార్ట్‌ఫోన్ అందించే కనెక్టివిటీ ఆప్షన్స్‌లో బ్లూటూత్ కూడా ఒకటి. ఏదైనా డివైజ్‌ను కనెక్ట్ చేయడానికి వైర్ అవసరం లేకుండా బ్లూటూత్ ఆన్ చేసి కనెక్ట్ చేయొచ్చు. స్పీకర్స్, ఇయర్‌ఫోన్స్, టీవీ లాంటి గ్యాడ్జెట్స్‌కు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇటీవల కాలంలో బ్లూటూత్ గ్యాడ్జెట్స్‌కి డిమాండ్ పెరుగుతోంది. యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్‌లో బ్లూటూత్ ఆప్షన్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
2. బ్లూటూత్ ఆన్ చేస్తే మీ స్మార్ట్‌ఫోన్‌లో కేవలం బ్లూటూత్ మాత్రమే ఆన్ అవుతుందని మీరు అనుకుంటే పొరపాటే. బ్లూటూత్ ఆన్ చేసినప్పుడు ఆ ఆప్షన్ మీరు ఉపయోగిస్తారు కానీ... మీకు తెలియకుండా మీ లొకేషన్ కూడా తెలిసిపోతుందని తాజాగా ఓ అధ్యయనం బయటపెట్టింది. ఈ అధ్యయనం ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో హాట్ టాపిక్‌గా మారింది. (ప్రతీకాత్మక చిత్రం)
3. లొకేషన్ షేర్ చేయడం అనేది యూజర్ల ప్రైవసీకి సంబంధించిన అంశం. స్మార్ట్‌ఫోన్ లొకేషన్ ఆన్ చేయాలా ఆఫ్‌లో ఉంచాలా అన్నది యూజర్ ఇష్టం. లొకేషన్ వివరాలు ఎవరికీ షేర్ చేయొద్దనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. అయితే యూజర్ లొకేషన్‌ను ఆఫ్‌లో ఉంచినా బ్లూటూత్ ఆన్ చేస్తే చాలు... లొకేషన్ వివరాలు కూడా షేర్ అవుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. అయితే బ్లూటూత్ ద్వారా యూజర్ల లొకేషన్ తెలుసుకోవడానికి ఓ మార్గం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి ఈ పద్ధతి వెళ్తే అది చాలా ప్రమాదకరమైనదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది ఎలా సాధ్యమో తెలుసుకోవడానికి అసలు బ్లూటూత్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందన్నదానిపై శాస్త్రవేత్తలు దృష్టిపెట్టారు. (ప్రతీకాత్మక చిత్రం)