1. ఈ రోజుల్లో దాదాపు అందరూ ఇన్స్టాంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ను వినియోగిస్తున్నారు. వాట్సాప్‌లో డేటా సెక్యూరిటీపై అప్పుడప్పుడూ వివాదాలు బయటకు వస్తున్నా.. ఎలాంటి సమస్య లేదని యాజమాన్య సంస్థ ఎప్పటికప్పుడు చెప్పుకొస్తోంది. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఆప్షన్ ఉందని ప్రచారం చేస్తోంది. అంటే మెసేజ్ పంపే వ్యక్తి, రిసీవ్ చేసుకొనే వ్యక్తి మధ్యలో ఇంకెవరూ ఉండరు. వాట్సాప్‌కు కూడా ఎలాంటి యాక్సెస్ ఉండదని చెబుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. తాజాగా ఈ యాప్ యూజర్లకు చెందిన 48 కోట్ల ఫోన్ నంబర్లు లీక్ అయ్యాయనే వివాదం రేగింది. అయితే ఈ విషయాన్ని వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా మాత్రం ఒప్పుకోవడం లేదు. సైబర్ సెక్యూరిటీ అంశాలను పబ్లిష్ చేసే ‘సైబర్ న్యూస్’ వెబ్సైట్ ఈ వార్తలను వెలుగులోకి తెచ్చింది. దాదాపుగా 48 కోట్ల వాట్సాప్(WhatsApp) యూజర్ల నంబర్లు లీక్ అయ్యాయని తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఈ డేటా బేస్‌లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు దేశాల ఫోన్ నంబర్లు ఉన్నట్లు సమాచారం. భారత్‌కు సంబంధించిన దాదాపు 60.2 లక్షల మంది యూజర్ల నంబర్లు కూడా అందులో ఉన్నట్లు పేర్కొంది. ఈ నివేదికపై సైబర్‌న్యూస్ చీఫ్ ఎడిటర్ జుర్గితా లాపియెనిట్ చేసిన ట్వీట్ ఆసక్తిగా మారింది. ఈ లీక్‌లో నిజానిజాలు ఏమిటో ఇంకా తెలియలేదన్నారు. అయితే వాట్సాప్ హ్యాక్ మాత్రం కాలేదని ట్వీట్లో పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
6. పేర్లు, ఐడీలు లాంటి పెద్దగా వివరాలు ఏమీ లేని వివరాల డేటా బేస్‌ను తరచుగా కొంత మంది లీక్ చేస్తుంటారని భద్రతా నిపుణులు చెబుతున్నారు. వీటిని సైబర్ నేరగాళ్లు తరచుగా కొనుక్కుని వాడుకుంటారని అంటున్నారు. ఫిషింగ్, స్కామ్‌లు, ఐడెంటిటీ థెఫ్ట్ లాంటివి చేయడానికి ఇలాంటి ఫోన్ నంబర్లను వాడుకుంటూ ఉంటారని తెలిపారు. ఈ విషయమై బెంగళూరుకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ ఇన్‌స్టా సేఫ్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ సందీప్ కుమార్ పాండా మాట్లాడారు. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఇప్పుడు ఫోన్ నంబర్ హార్వెస్టింగ్ అనేది సర్వ సాధారణం అయిపోయిందన్నారు. టెలీ మార్కెటర్లలాంటి క్లయింట్లకు హ్యాకర్లు ఈ డేటాను అమ్ముకుంటారని చెప్పారు. వారి ఉత్పత్తులను విక్రయించుకోడానికి ఇటువంటి డేటా బేస్‌లను కొనుగోలు చేస్తుంటారని తెలిపారు. నంబర్‌కు సంబంధించిన పేరు తెలియక పోయినా ఇటువారికి ఇబ్బంది ఉండదని చెప్పారు. ఈ డేటాలో కొంత మందినైనా వీరు తమ కస్టమర్లుగా మార్చుకుంటారని తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
8. ఇంత పెద్ద స్థాయిలో డేటా లీక్ అయిందన్న వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది ఏప్రిల్‌లో ఫోన్ నెంబర్లు, పేర్లు, సోషల్ మీడియా ఐడీలు, లొకేషన్, ప్రొఫైల్ బయోగ్రాఫ్లు, ఈమెయిల్ ఐడీలు... లాంటి అన్ని వివరాలతో కూడిన సమాచారం లీకైనట్లు వార్తలు వచ్చాయి. 106 దేశాలకు చెందిన దాదాపుగా 53 కోట్ల మంది వివరాలు లీకైనట్లు పీటీఐ తెలిపింది. అయితే ఈ విషయంపై అప్పుడు వాట్సాప్ స్పోక్స్ పర్సన్ ఒకరు మాట్లాడారు. ఈ సంఘటన జరిగినట్లు అంగీకరించారు. (ప్రతీకాత్మక చిత్రం)
9. అయితే అది 2019లో జరిగినదని ఇప్పటిది కాదని చెప్పారు. ఆ సమస్యను తాము అప్పుడే పరిష్కరించేశామని వెల్లడించారు. గత ఏడాది సెప్టెంబర్‌లో కూడా వాట్సాప్‌కు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఐరిష్ డేటా ప్రొటక్షన్ కమిషన్ వాట్సాప్‌కు 225 మిలియన్ యూరోల జరిమానా విధించింది. దీంతో యూరప్‌లో కొత్త ప్రైవసీ పాలసీని కంపెనీ తీసుకొచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)