1. వేసవి ఎండలు మండిపోతున్నాయి. మరి ఇంట్లోకి ఎయిర్ కండీషనర్ కొనాలనుకుంటున్నారా? సమ్మర్లో ఏసీ కొనుగోళ్లు పెరిగిపోతాయన్న సంగతి తెలిసిందే. అయితే ఏసీ ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏసీ మాత్రమే కాదు ఏ వస్తువు కొనాలన్నా ముందుగా దాని గురించి కాస్త స్టడీ చేయడం అవసరం. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఏసీల్లో చాలా రకాలు రకాలు ఉంటాయి. విండో ఏసీ, స్ప్లిట్ ఏసీ, టవర్ ఏసీ, సెంట్రలైజ్డ్ ఏసీ... ఇలా చాలా రకాలు ఉంటాయి. కానీ ఇళ్లల్లో విండో ఏసీ, స్ప్లిట్ ఏసీలనే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కాబట్టి వీటికే డిమాండ్ ఎక్కువ. ఈ రెండు ఏసీల్లో దాదాపు ఫీచర్స్‌లో పెద్దగా తేడా ఉండదు. కానీ సైజ్ విషయంలోనే తేడాలు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఒకే రూమ్‌కు కావాలనుకుంటే విండో ఏసీ తీసుకోవచ్చు. స్ప్లిట్ ఏసీ కన్నా విండో ఏసీని సులువుగా ఇన్స్టాల్ చేయొచ్చు. విండో ఉంటే చాలు. చిన్న సైజ్ రూమ్ కోసం విండో ఏసీ సరిపోతుంది. ధర కూడా తక్కువ. స్ప్లిట్ ఏసీలో రెండు యూనిట్స్ ఉంటాయి. ఒకటి ఇంట్లో ఉంటే, మరొకటి ఇంటి బయట ఉంటుంది. స్ప్లిట్ ఏసీ ఇన్స్టాల్ చేయడానికి కాస్త కష్టం. రూమ్‌కు విండో లేనివాళ్లు స్ప్లిట్ ఏసీ తీసుకోవాల్సి వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఏసీ కెపాసిటీ రూమ్ సైజ్‌ని బట్టి మారుతుంది. ఏసీ కెపాసిటీని టన్నేజ్ అంటే టన్నుల్లో కొలుస్తారు. టన్ అంటే బరువు అని అర్థం కాదు. ఓగదిని ఏసీ కూల్ చేసే కెపాసిటీని టన్నుతో కొలుస్తారు. ఏసీలు 1 టన్ నుంచి 2 టన్ కెపాసిటీ మధ్య దొరుకుతాయి. చిన్న గదికి 1 టన్, పెద్ద గదికి 2 టన్ ఏసీ కావాలి. రూమ్ సైజ్ 100 నుంచి 125 స్క్వేర్ ఫీట్ ఉంటే 1 టన్ ఏసీ సరిపోతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. రూమ్ సైజ్ 150 నుంచి 200 చదరపు అడుగులు ఉంటే 1.5 టన్ ఏసీ తీసుకోవాలి. ఇక గది సైజ్ 200 చదరపు అడుగుల కన్నా ఎక్కువ ఉంటే 2 టన్ ఏసీ తీసుకోవాలి. 1 టన్ విండో ఏసీ ధర రూ.17,000 నుంచి మొదలవుతుంది. 1 టన్ స్ప్లిట్ ఏసీ ధర రూ.21,000 నుంచి మొదలవుతుంది. కంపెనీలు, ఇతర ఫీచర్లను బట్టి ధర మారుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఏసీ ఉంటే ఎక్కువ విద్యుత్ ఖర్చవుతుంది. అందుకే ఏసీ కొనేందుకు సామాన్యులు వెనకాడుతుంటారు. అందుకే ఏసీ కొనేముందు ఎనర్జీ ఎఫీషియెంట్ రేటింగ్ చెక్ చేయాలి. ప్రతీ ఏసీపైన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ-BEE రేటింగ్ ఉంటుంది. 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్ అని రేటింగ్స్ ఉంటాయి. ఎక్కువ స్టార్స్ ఉన్న ఏసీ తీసుకుంటే తక్కువ విద్యుత్ ఖర్చవుతుంది. ఒకే స్టార్ ఉన్న ఏసీ తీసుకుంటే ఎక్కువ విద్యుత్ ఖర్చవుతుంది. అందుకే 5 స్టార్ రేటింగ్ ఉన్న ఏసీ తీసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)