RELIANCE JIO WORK FROM HOME PLAN GET 2GB DATA PER DAY FOR 51 DAYS WITH RS 251 RECHARGE SS
Jio Prepaid Plan: ఈ జియో ప్లాన్ రీఛార్జ్ చేస్తే 102 జీబీ డేటా వాడుకోవచ్చు
Jio Prepaid Plan | కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించగానే రిలయెన్స్ జియో వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే మొత్తం 102 జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. ప్లాన్ వివరాలు తెలుసుకోండి.
1. మీరు రిలయెన్స్ జియో యూజరా? వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? రిలయెన్స్ జియో 'వర్క్ ఫ్రమ్ హోమ్' రీఛార్జ్ ప్లాన్ అందిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
2. కరోనా వైరస్ లాక్డౌన్ ఉండటంతో అనేక మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. లాక్డౌన్ ఎత్తేసేవరకు ఈ పరిస్థితి తప్పదు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
3. ఇంటి దగ్గర్నుంచి పనిచేస్తున్నప్పుడు డేటా ఎక్కువగా ఉపయోగించడం మామూలే. అందుకే రిలయెన్స్ జియో వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్ ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
4. రిలయెన్స్ జియో వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్ ధర రూ.251. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నవారికి 51 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజుకు 2 జీబీ డేటా వాడుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
5. ఈ ప్లాన్ కేవలం ఇంటర్నెట్ బెనిఫిట్స్ కోసమే. కాబట్టి ప్రత్యేకంగా కాల్స్, ఎస్ఎంఎస్ లాంటి బెనిఫిట్స్ ఏవీ ఉండవు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
6. ఒకవేళ కస్టమర్ ఒక రోజులో 2 జీబీ కన్నా ఎక్కువ వాడితే ఆ తర్వాత 64 కేబీపీఎస్తో డేటా వాడుకోవచ్చు. ఈ డేటాకు లిమిట్ లేదు. ఎంతైనా వాడుకోవచ్చు. కానీ స్పీడ్ తక్కువ ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)