తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలను అందిస్తూ.. రిలయన్స్ జియో టెలికాం రంగంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. చిన్న ప్లాన్ల నుంచి పెద్ద వార్షిక ప్లాన్ల వరకు, కంపెనీ తన కస్టమర్ల కోసం అనేక రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఇప్పుడు మరో వార్షిక రీఛార్జ్ ప్లాన్ను విడుదల చేసింది జియో. (ప్రతీకాత్మక చిత్రం)
అయితే.. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకున్న వారికి అదనపు బెనిఫిట్స్ ను ప్రకటించింది జియో. ఈ ప్లాన్ ను ఎంచుకున్న వారికి అదనంగా మరో 23 రోజుల వ్యాలిడిటీని అందించనున్నట్లు ప్రకటించింది. అంటే ఈ ప్లాన్ ను ఎంచుకున్న వారికి 388 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అంటే ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే.. దాదాపు 13 నెలల వరకు ఎలాంటి టెన్షన్ ఉండదు. (ప్రతీకాత్మక చిత్రం)