1. రిలయన్స్ జియో దీపావళి పండుగ సీజన్ సందర్భంగా ప్రత్యేక ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ.2,999 యాన్యువల్ ప్లాన్‌పై దివాళీ ఆఫర్‌ను (Jio Diwali Offer) అందిస్తోంది. దీపావళి పండుగ ముగిసినా జియో యూజర్లు ఈ ఆఫర్ పొందొచ్చు. ఈ ఆఫర్ ద్వారా యూజర్లు 100 శాతం వ్యాల్యూ బ్యాక్ పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
2. జియో యూజర్లు రూ.2,999 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 365 రోజుల వేలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్‌పై ఇంటర్నెట్ డేటా, వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్ బెనిపిట్స్ లభిస్తున్నాయి. యూజర్లు రోజూ 2.5జీబీ వరకు డేటా ఉపయోగించుకోవచ్చు. ఏడాది మొత్తం 912.5జీబీ డేటా వాడుకోవచ్చు. రోజూ 100ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3. జియో దివాళీ ఆఫర్లో భాగంగా యూజర్లకు 75జీబీ వరకు అదనంగా డేటా లభిస్తుంది. జియో టీవీ, జియోసెక్యూరిటీ, జియో క్లౌడ్ లాంటి జియో యాప్స్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. దివాళీ ఆఫర్లో భాగంగా జూమిన్, ఫెర్న్స్ అండ్ పెటల్స్, ఇక్సిగో, ఆజియో, అర్బన్ ల్యాడర్, రిలయన్స్ డిజిటల్ నుంచి మొత్తం రూ.2,999 విలువైన కూపన్స్ లభిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. జియో నుంచి మొత్తం మూడు యాన్యువల్ ప్లాన్స్ ఉన్నాయి. అందులో రూ.2,999 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ పైనే దివాళీ ఆఫర్ ఉంది. ఇక రూ.2,879 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 365 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా చొప్పున మొత్తం 730జీబీ డేటా వాడుకోవచ్చు. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. రోజూ 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఇక రూ.2,545 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 336 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా చొప్పున మొత్తం 504జీబీ డేటా వాడుకోవచ్చు. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. రోజూ 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. మూడు యాన్యువల్ ప్లాన్స్‌కు జియో యాప్స్ సబ్స్క్రిప్షన్ కాంప్లిమెంటరీగా లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)