1. రిలయన్స్ జియో (Reliance Jio) యూజర్లకు శుభవార్త. డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తో రిలయన్స్ జియో మరో మూడు కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ (Jio Hotstar Plans) ప్రకటించింది. ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా రూ.149 విలువైన మూడు నెలల డిస్నీ+ హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా పొందొచ్చు. ఇందుకోసం కేవలం రూ.333, రూ.583, రూ.783 ప్లాన్స్‌తో పాటు రూ.151 యాడ్ ఆన్ ప్లాన్ రీఛార్జ్ చేస్తే చాలు. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఇప్పటికే డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో అనేక ప్లాన్స్‌ను అందిస్తోంది రిలయన్స్ జియో. ఇప్పుడు జియో క్రికెట్ ప్లాన్స్‌లో భాగంగా మూడు నెలల డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తో మరో ప్లాన్ ప్రకటించడం విశేషం. జియో యూజర్లు తమ అవసరాలకు తగ్గట్టుగా ఈ ప్లాన్స్ ఎంచుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3. Jio Rs 333 Plan: జియో యూజర్లు రూ.333 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. మొత్తం 42జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. రోజూ 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ మూడు నెలలు ఉచితం. (ప్రతీకాత్మక చిత్రం)
4. Jio Rs 583 Plan: జియో యూజర్లు రూ.583 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 56 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. మొత్తం 84జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. రోజూ 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ మూడు నెలలు ఉచితం. (ప్రతీకాత్మక చిత్రం)
5. Jio Rs 783 Plan: జియో యూజర్లు రూ.783 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. మొత్తం 126జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. రోజూ 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ మూడు నెలలు ఉచితం. (ప్రతీకాత్మక చిత్రం)
7. జియో యూజర్లు రూ.333, రూ.583, రూ.783 ప్లాన్స్ రీఛార్జ్ చేసిన తర్వాత అదే నెంబర్‌తో డిస్నీ+ హాట్‌స్టార్ యాప్‌లో లాగిన్ కావాలి. జియో నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే మీ ప్లాన్ యాక్టివేట్ అవుతుంది. మూడు నెలల పాటు డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ ఉపయోగించుకోవచ్చు. లైవ్ క్రికెట్ మ్యాచ్‌లతో పాటు డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఉన్న ఇతర కంటెంట్ చూడొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
8. మూడు నెలలు డిస్నీ+ హాట్‌స్టార్ యాక్సెస్ చేయాలంటే జియో ప్లాన్ యాక్టీవ్‌గా ఉండాలన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇక రిలయన్స్ జియో రూ.499, రూ.799, రూ.1,066, రూ.3,119, రూ.2999, రూ.601, రూ.1499, రూ.4199 ప్లాన్స్‌కి, రూ.555, రూ.659 డేటా యాడ్ ఆన్ ప్లాన్లకు డిస్నీ+ హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ ఇస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)