దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. దీంతో అనేక ప్రాంతాల్లో ఇప్పటికే లాక్ డౌన్ విధించారు. లాక్ డౌన్ సడలింపు ఉన్న సమయాల్లోనూ అనేక మంది బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న వారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో అనేక మొబైల్ కంపెనీలు, టెలికాం కంపెనీలు వారి కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
Samsung: కరోనా నేపథ్యంలో సాంసంగ్ సంస్థ తన కస్టమర్లకు సర్వీస్ విషయంలో కీలక మార్పులు చేసింది. మొబైల్స్, టాబ్లెట్లను రిపైర్ కోసం కాంటాక్ట్ లెస్ పిక్ అండ్ డ్రాప్ సర్వీసులను తీసుకువచ్చింది. ఈ సేవలు దేశంలోని 46 ప్రముఖ సిటీల్లో తీసుకువచ్చింది. అందులో ముంబాయి, కోల్ కత్తా, చెన్నై, పూణే, నోయిడా, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ ఉన్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
Realme: కరోనా నేపథ్యంలో ప్రముఖ మొబైల్ కంపెనీ రియల్ మీ సైతం కీలక నిర్ణయం తీసుకుంది. వారంటీ గడువును జూల్ 31 వరకు పొడిగించింది. ఈ ఆఫర్ మే 1 నుంచి జూన్ 30 వరకు వారంటీ ఎక్స్పైరీ అయ్యే వారికి మాత్రమే ఉంటుంది. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, స్మార్ట్ వాచ్ లు, ఇయర్ ఫోన్స్ కు ఈ వారంటీ ఆఫర్ వర్తించనుంది.(ప్రతీకాత్మక చిత్రం)
Airtel: ఎయిర్టెల్ సంస్థ కూడా కరోనా నేపథ్యంలో తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. రూ. 49 ప్లాన్ ను ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది. ఈ ప్లాన్ తో రూ. 38 టాక్ టైంతో పాటు 100 ఎంబీ డేటా లభించనుంది. దీంతో పాటు రూ. 79 రీచార్జ్ ప్లాన్ తో వచ్చే ప్రయోజనాలను డబుల్ చేసింది ఎయిర్టెల్.(ప్రతీకాత్మక చిత్రం)