1. ట్రాయ్ ఆదేశాలతో టెలికాం కంపెనీలు 30 రోజుల వేలిడిటీతో ప్లాన్స్ ప్రకటిస్తున్నాయి. రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా (Vi) తమ కస్టమర్ల కోసం కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ (Prepaid Plans) తీసుకొచ్చాయి. టెలికామ్ కంపెనీలన్నీ 30 రోజుల వేలిడిటీతో ప్లాన్స్ తీసుకురావాలని టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) జనవరిలో ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ట్రాయ్ టెలీకమ్యూనికేషన్ ఆర్డర్ 1999 లో సవరణలు కూడా చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. టెలికామ్ ఆపరేటర్లు నెల అంటే 30 రోజుల వేలిడిటీ కాకుండా కేవలం 28 రోజుల వేలిడిటీతో ప్లాన్స్‌ని ఆఫర్ చేస్తున్నారని యూజర్లు ఆందోళన వ్యక్తం చేయడంతో ట్రాయ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. కనీసం ఒక్క ప్లాన్ అయినా 30 రోజుల వేలిడిటీతో ఉండాలని కోరింది. సాధారణంగా 28, 56, 84 రోజుల వేలిడిటీతో ప్లాన్స్ లభించేవి. ఇప్పుడు పూర్తి నెల రోజుల వేలిడిటీతో ప్లాన్స్ రీఛార్జ్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3. రిలయన్స్ జియో కూడా 'క్యాలెండర్ మంత్ వేలిడిటీ' పేరుతో రూ.259 ప్లాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. క్యాలెండర్ మంత్ అంటే ఉదాహరణకు మీరు ఏప్రిల్ 4న రీఛార్జ్ చేస్తే మళ్లీ మే 4న రీఛార్జ్ చేస్తే చాలు. ఇలా ప్రతీ నెలా 4వ తేదీన రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. రూ.259 ప్లాన్ రీఛార్జ్ చేస్తే రోజూ 1.5జీబీ డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 100 ఎస్ఎంఎస్, జియో యాప్స్ సబ్స్క్రిప్షన్ లభిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఎయిర్టెల్ రూ.296, రూ.319 ప్లాన్స్ ప్రకటించింది. ఇప్పటికే ఎయిర్టెల్ నుంచి ఉన్న ప్లాన్స్ ఈ ప్లాన్స్‌లో వాయిస్ కాలింగ్, డేటా బెనిఫిట్స్ లభిస్తాయి. అయితే ఈ రెండు ప్లాన్స్‌కు 30 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రూ.296 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 30 రోజుల వేలిడిటీ లభిస్తుంది. మొత్తం 25జీబీ డేటా వాడుకోవచ్చు. అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఇక రూ.319 ప్లాన్ రీఛార్జ్ చేస్తే నెల రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా వాడుకోవచ్చు. అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. రూ.296, రూ.319 ప్లాన్స్‌పై అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ 30 రోజుల ఫ్రీ ట్రయల్, అపోలో 24×7 సర్కిల్ మూడు నెలల సబ్స్క్రిప్షన్, ఫాస్ట్‌ట్యాగ్‌పై రూ.100 క్యాష్‌బ్యాక్, వింక్ మ్యూజిక్ ఫ్రీ యాక్సెస్ లభిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. మరోవైపు వొడాఫోన్ ఐడియా (Vi) కూడా 30, 31 రోజుల వేలిడిటీతో రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్‌ని ప్రకటించింది. రూ.327 రీఛార్జ్ చేస్తే 30 రోజుల వేలిడిటీ, 25జీబీ డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ లభిస్తాయి. ఇక రూ.337 రీఛార్జ్ చేస్తే 31 రోజుల వేలిడిటీ, 28జీబీ డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ లభిస్తాయి. ఈ రెండు ప్లాన్స్‌పై వీఐ మూవీస్, టీవీ యాప్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)