1. గూగుల్‌తో కలిసి తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది రిలయెన్స్ జియో. జియో 4జీ స్మార్ట్‌ఫోన్ రూపొందిస్తుందన్న వార్తలు చాలాకాలంగా వస్తున్నాయి. దీంతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు రిలయెన్స్ 44వ ఏజీఎంలో రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్-RIL ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముకేష్ అంబానీ JioPhone Next రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
9. ఇండియాలో 5జీ నెట్వర్క్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారంతా. ఇప్పటికే మార్కెట్లోకి 5జీ స్మార్ట్ఫోన్లు వచ్చేశాయి. 5జీ నెట్వర్క్ వస్తుందన్న ముందుచూపుతో యూజర్లు 5జీ స్మార్ట్ఫోన్లు కొంటున్నారు. జియో 5జీ నెట్వర్క్ తీసుకొస్తామని ముకేష్ అంబానీ గతేడాది ప్రకటించడంతో జియో 5జీపై అంచనాలు పెరుగుతున్నాయి.
12. స్పెక్ట్రం కోసం రూ.57,123 కోట్లు, నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం రూ.15,183 కోట్లు అదనంగా ఖర్చుచేశామన్నారు. ఇండోర్ కవరేజ్, డౌన్లోడ్ స్పీడ్, వీడియో స్ట్రీమింగ్ కోసం జియో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగపడుతుందన్నారు. మరో 20 కోట్ల మంది కస్టమర్లను చేర్చుకోగలిగే సత్తా తమకు ఉందని ముకేష్ అంబానీ తెలిపారు.