1. ఐఫోన్... యాపిల్ అందిస్తున్న ప్రీమియం ప్రొడక్ట్స్‌లో ఐఫోన్‌కు డిమాండ్ ఎక్కువ. ఐఫోన్‌తోనే యాపిల్ (Apple) బ్రాండ్ పాపులర్ అయింది. ఆ తర్వాత యాపిల్ నుంచి ఇతర స్మార్ట్ ప్రొడక్ట్స్ (Apple Smart Products) వస్తున్నాయి. ఐఫోన్ కొనడం కొందరికి స్టేటస్ సింబల్. అందుకే యాపిల్ రిలీజ్ చేసే ఐఫోన్లకు ఎప్పుడూ డిమాండ్ కనిపిస్తూనే ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఐఫోన్లో బేసిక్ మోడల్ కొనాలన్నా రూ.40,000 పైనే ఖర్చు చేయాల్సి ఉంటుంది. హైఎండ్ మొబైల్ కొనాలంటే రూ.1,50,000 పైనే చెల్లించాలి. మార్కెట్లో సెకండ్ హ్యాండ్ ఐఫోన్లకు డిమాండ్ బాగానే ఉంది. ఫ్లిప్‌కార్ట్ లాంటి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్ కూడా సెకండ్ హ్యాండ్ ఐఫోన్లను అమ్ముతున్నాయి. రీఫర్బిష్డ్ పేరుతో సెకండ్ హ్యాండ్ మొబైల్స్ అందుబాటులో ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఫ్లిప్‌కార్ట్‌లో రీఫర్బిష్డ్ సెక్షన్లో సెకండ్ హ్యాండ్ ఐఫోన్లను చూడొచ్చు. కేవలం రూ.10,000 లోపు కొన్ని ఐఫోన్ పాత మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంకొన్ని రూ.15,000 లోపు బడ్జెట్లో ఉన్నాయి. ప్రస్తుతం ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ 6, ఐఫోన్ఎస్, ఐఫోన్ 7 మోడల్స్ ఫ్లిప్‌కార్ట్‌లో రీఫర్బిష్డ్ సెక్షన్లో అందుబాటులో ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఐఫోన్ 6ఎస్ స్మార్ట్‌ఫోన్ 16జీబీ వేరియంట్‌ను రూ.9,899 ధరకు సొంతం చేసుకోవచ్చు. ఇదే మోడల్ 32జీబీ వేరియంట్ రూ.9,999 ధరకు లభిస్తోంది. ఇక ఐఫోన్ 7 మొబైల్ 32జీబీ వేరియంట్ రూ.13,550 ధరకు లభిస్తోంది. అన్ని మోడల్స్ వేర్వేరు కలర్స్‌లో అందుబాటులో ఉన్నాయి. కలర్ మారితే ధర కూడా మారుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఫ్లిప్‌కార్ట్ రీఫర్బిష్డ్ సెక్షన్లో నాలుగు సెక్షన్స్ ఉంటాయి. అన్‌బాక్స్‌డ్-లైక్ న్యూ, రీఫర్బిష్డ్-సూపర్బ్, రీఫర్బిష్డ్-గుడ్, రీఫర్బిష్డ్-ఓకే పేరుతో నాలుగు కేటగిరీలు ఉంటాయి. వీటిని చెక్ చేసి ప్రొడక్ట్ సెలెక్ట్ చేయొచ్చు. రీఫర్బిష్డ్ సెక్షన్‌లోని డివైజ్‌ను 47 రకాల క్వాలిటీ చెక్స్ చేస్తామని, నిపుణులు వీటిని పరిశీలిస్తారని ఫ్లిప్‌కార్ట్ చెబుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)