Redmi Note 9 Pro | లాక్డౌన్ కారణంగా స్మార్ట్ఫోన్ల అమ్మకాలు నిలిచిపోయాయి. ఆన్లైన్లో కూడా సేల్స్ ఆగిపోయాయి. కేంద్ర ప్రభుత్వం కొన్ని మినహాయింపులు ఇవ్వడంతో మళ్లీ స్మార్ట్ఫోన్ సేల్స్ మొదలయ్యాయి. ఇవాళ రెడ్మీ నో 9 ప్రో ఆన్లైన్ సేల్ ప్రారంభం కానుంది.
1. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు రెడ్మీ నోట్ 9 ప్రో ఆన్లైన్ సేల్ ప్రారంభం కానుంది. ప్రభుత్వం లాక్డౌన్ ఆంక్షల్ని సడలించిన తర్వాత తొలి స్మార్ట్ఫోన్ సేల్ ఇదే. (image: Redmi India)
2/ 11
2. రెడ్మీ నోట్ 9 ప్రో ఆన్లైన్ సేల్ గురించి షావోమీ ఇండియా అధికారికంగా ప్రకటించింది. Mi.com, అమెజాన్ వెబ్సైట్లలో ఈ ఫోన్ కొనొచ్చు. (image: Redmi India)
3/ 11
3. అయితే రెడ్జోన్లో ఉన్నవారికి ఇప్పట్లో డెలివరీ ఉండదు. కేవలం గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఇ-కామర్స్ కార్యకలాపాలకు మాత్రమే అనుమతి ఇచ్చింది కేంద్ర హోమ్ శాఖ. (image: Redmi India)
4/ 11
4. ఇక రెడ్మీ నోట్ 9 ప్రో విశేషాలు చూస్తే షావోమీ రెండు నెలల క్రితం రెడ్మీ నోట్ 9 ప్రో, రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేసింది. రెడ్మీ నోట్ 9 ప్రో, రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ స్మార్ట్ఫోన్ల ఫీచర్లు దాదాపు ఒకేలా ఉన్నాయి. (image: Redmi India)
5/ 11
5. ఈ రెండు ఫోన్లలో ఇస్రోకు చెందిన నావిక్ టెక్నాలజీ ఉంది. స్నాప్డ్రాగన్ 720జీ ప్రాససెర్, 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 5020 ఎంఏహెచ్ ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి కామన్ ఫీచర్స్ ఉన్నాయి. (image: Redmi India)