1. కొత్త సంవత్సరంలో మళ్లీ కొత్త స్మార్ట్ఫోన్ల సందడి మొదలైంది. ఇటీవల రెడ్మీ నోట్ 12 సిరీస్‌లో (Redmi Note 12 Series) రిలీజైన రెడ్మీ నోట్ 12, రెడ్మీ నోట్ 12 ప్రో (Redmi Note 12 Pro), రెడ్మీ నోట్ 12 ప్రో+ సేల్ ప్రారంభమైంది. రూ.21,999 విలువైన రెడ్మీ నోట్ 12 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ ఆఫర్లో రూ.5,000 లోపే సొంతం చేసుకోవచ్చు. (image: Xiaomi India)
2. రెడ్మీ నోట్ 12 ప్రో స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో రిలీజైంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులతో కొంటే రూ.3,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. (image: Xiaomi India)
4. ఫ్లిప్‌కార్ట్‌లో పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.23,000 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది ఈ ఆఫర్‌తో రెడ్మీ నోట్ 12 ప్రో మొబైల్‌ను రూ.5,000 లోపే సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో కొంటే 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. నోకాస్ట్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. రూ.4,500 నుంచి నోకాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ప్రారంభం అవుతుంది. (image: Xiaomi India)
5. రెడ్మీ నోట్ 12 ప్రో డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల అమొలెడ్ డిస్ప్లే ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ రియల్మీ 10 ప్రో+ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో కూడా ఉంది. ఆండ్రాయిడ్ 12 + ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. రెండేళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్, 4 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ అందించనుంది షావోమీ. (image: Xiaomi India)
6. రెడ్మీ నోట్ 12 ప్రో కెమెరా ఫీచర్స్ చూస్తే ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50మెగాపిక్సెల్ Sony IMX766 సెన్సార్ + 8మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. (image: Xiaomi India)
7. రెడ్మీ నోట్ 12 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 5,000mAh బ్యాటరీ, 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఛార్జర్ బాక్సులోనే లభిస్తుంది. 46 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్ చేయొచ్చని కంపెనీ చెబుతోంది. వైఫై 6, డ్యూయెల్ స్టీరియో స్పీకర్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. స్టార్ డస్ట్ పర్పుల్, ఫ్రోస్టెడ్ బ్లూ, ఓనిక్స్ బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు. (image: Xiaomi India)