ధర : రియల్మీ 10 ప్రో ప్లస్ 5జీ.. మూడు వేరియంట్లలో లభిస్తుంది. బేస్ వేరియంట్ 6GB+128GB ధర రూ.24,999. 8GB+128GB వేరియంట్ ధర రూ.25,999. హై ఎండ్ వేరియంట్ 8GB+256GB ధర రూ.27,999. ఇక రెడ్మీ నోట్ 12 ప్రో ప్లస్ 5జీ వేరియంట్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. బేస్ వేరియంట్ 8GB+256GB ధర రూ. 29,999 కాగా, 12GB +256GB వేరియంట్ ధర రూ.32,999గా కంపెనీ నిర్ణయించింది.
డిజైన్, డిస్ప్లే : రెడ్మీ నోట్ 12 ప్రో ప్లస్ 5జీ... 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల ఫుల్ HD+ ప్రో AMOLED డిస్ ప్లేతో లభిస్తుంది. ఈ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 SoC చిప్సెట్తో బెస్ట్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. 12 బేస్డ్ MIUI 13తో రన్ అవుతుంది. ఇక రియల్మీ 10 ప్రో ప్లస్ 5G.. 120 Hz రిఫ్రెష్ రేట్, 2,160 Hz డిమ్మింగ్‌తో 6.7-అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో లభిస్తుంది. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ Realme UI 4.0తో ఇది రన్ అవుతుంది. ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 5G చిప్సెట్తో డివైజ్ పనిచేస్తుంది.
రెడ్మీ నోట్ 12 ప్రో ప్లస్ ఫోన్ గ్లాస్ బ్యాక్‌తో వస్తుంది. ఇది మెటాలిక్ కెమెరా హౌసింగ్‌ను అందిస్తుంది. ఇక రియల్మీ 10 ప్రో ప్లస్ 5G ఫోన్ మాత్రం కర్వ్డ్ డిస్ప్లే ఎడ్జ్‌తో లభిస్తుంది. రెడ్మీ డివైజ్‌తో పోలిస్తే ఇది తేలికగా ఉంటుంది. ఫోన్ వెనుక వైపు ట్విన్-రింగ్ కెమెరా మాడ్యూల్తో రిఫ్లెక్టివ్ గ్లాసీ డిజైన్ ఉంటుంది.
కెమెరా, బ్యాటరీ : రెడ్మీ నోట్ 12 ప్రో ప్లస్‌లో రియర్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 200MP OIS సెన్సార్, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2MP మాక్రో సెన్సార్ ఉంటాయి. ఫోన్ ముందు భాగంలో సెల్ఫీల కోసం 16MP సెన్సార్ అమర్చారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 4,980mAh బ్యాటరీ ఉంటుంది. రియల్మీ 10 ప్రో ప్లస్‌లోనూ రియర్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108MP ప్రైమరీ కెమెరా సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ సెన్సార్, మాక్రో సెన్సార్ ఉంటుంది. ఫోన్ ముందు భాగంలో వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 16MP కెమెరా సెన్సార్ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 67W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5,000mAh బ్యాటరీ ఉంటుంది.