Redmi Note 11T 5G: షావోమీ సబ్ బ్రాండ్ అయిన రెడ్మీ ఇండియా నుంచి వచ్చిన మరో 5జీ స్మార్ట్‌ఫోన్ ఇది. గతంలో రిలీజ్ చేసిన రెడ్మీ నోట్ 10టీ 5జీ మోడల్‌కు అప్‌గ్రేడ్ వర్షన్ ఇది. ఆఫర్లో రెడ్మీ నోట్ 11టీ 5జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ వేరియంట్‌ను రూ.14,999 ధరకు, 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.15,999 ధరకు, 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.16,999 ధరకు సొంతం చేసుకోవచ్చు.
Redmi Note 11T 5G: రెడ్మీ నోట్ 11టీ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్ ప్రో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 50మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా సెటప్, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా లాంటి ప్రత్యేకతలున్నాయి.
Redmi Note 10T 5G: రెడ్మీ నోట్ 10టీ 5జీ రెడ్మీ నుంచి వచ్చిన తొలి 5జీ స్మార్ట్‌ఫోన్. రెడ్మీ నోట్ 10టీ 5జీ స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999. రెడ్మీ నోట్ 10టీ ధర కన్నా రెడ్మీ నోట్ 11టీ ధర కాస్త తక్కువగానే ఉంది.
Redmi Note 10T 5G: రెడ్మీ నోట్ 10టీ 5జీ స్పెసిఫికేషన్స్ చూస్తే 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్, 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
Realme 8 5G: రియల్మీ 8 5జీ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల ఫుల్హెచ్డీ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్, 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ టెర్టియరీ సెన్సార్లతో రియర్ కెమెరా కెమెరా సెటప్, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ క్విక్ ఛార్జ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి.
Poco M3 Pro 5G: పోకో ఎం3 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డాట్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్, 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి.
Realme Narzo 30 5G: రియల్మీ నార్జో 30 5జీ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 700 5జీ ప్రాసెసర్, 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్, 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
Oppo A53s 5G: ఒప్పో ఏ53ఎస్ 5జీ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.52 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్, 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.