1. షావోమీ సబ్ బ్రాండ్ రెడ్మీ ఇండియా గతేడాది ఇండియాలో రెడ్మీ నోట్ 11టీ 5జీ (Redmi Note 11T 5G) స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది. రెడ్మీ నోట్ సిరీస్‌లో రిలీజ్ అయిన రెండో 5జీ స్మార్ట్‌ఫోన్ ఇది. అంతకుముందు రిలీజ్ అయిన రెడ్మీ నోట్ 10టీ 5జీ మోడల్ అప్‌గ్రేడ్ మోడల్‌గా రెడ్మీ నోట్ 11టీ 5జీ పరిచయమైంది. (image: Redmi India)
2. రూ.20,000 లోపు బడ్జెట్లో ఇతర బ్రాండ్లకు గట్టి పోటీ ఇస్తున్న రెడ్మీ నోట్ 11టీ 5జీ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు అమెజాన్‌లో మంచి ఆఫర్‌తో లభిస్తోంది. రెడ్మీ నోట్ 11టీ 5జీ అసలు ధరలు చూస్తే 6జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 128జీబీ ధర రూ.19,999. (image: Redmi India)
3. అమెజాన్‌లో స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ డేస్ సేల్‌లో భాగంగా రెడ్మీ నోట్ 11టీ 5జీ స్మార్ట్‌ఫోన్ బేస్ వేరియంట్‌ను కేవలం రూ.14,499 ధరకే సొంతం చేసుకోవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్, బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్‌తో తక్కువ ధరకే ఈ స్మార్ట్‌ఫోన్ లభిస్తోంది. ఈ రెండు ఆఫర్స్ కలిపి రూ.2,500 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. (image: Redmi India)
4. బ్యాంకు ఆఫర్ల వివరాలు చూస్తే యాక్సిస్ మైల్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డులతో కొంటే 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. గరిష్టంగా రూ.1750 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. హెచ్ఎస్బీసీ క్యాష్‌బ్యాక్ కార్డుతో కొంటే 5 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.16,149 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ప్రకటించింది అమెజాన్. (image: Redmi India)
5. ఇక రెడ్మీ నోట్ 11టీ 5జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ 810 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ వివో వీ23ఈ 5జీ, లావా అగ్ని 5జీ, రియల్మీ 8ఎస్ 5జీ లాంటి మోడల్స్‌లో కూడా ఉండటం విశేషం. (image: Redmi India)
6. రెడ్మీ నోట్ 11టీ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 50మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్లతో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. రియర్ కెమెరాలో పోర్ట్రైట్, పనోరమా, ప్రో మోడ్, నైట్ మోడ్, ఏఐ వాటర్‌మార్క్, హెచ్డీఆర్, ఏఐ సీన్ డిటెక్షన్, గూగుల్ లెన్స్, మూవీ ఫ్రేమ్, ప్రో కలర్, కలర్ ఫోకస్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Redmi India)
8. రెడ్మీ నోట్ 11టీ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్‌తో 3జీబీ ర్యామ్ వరకు పెంచుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33వాట్ ప్రో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను స్టార్ డస్ట్ వైట్, మ్యాటీ బ్లాక్, మ్యాజెస్టిక్ బ్లూ కలర్స్‌లో కొనొచ్చు. (image: Redmi India)