1. రెడ్మీ ఇండియా ఇటీవల రెడ్మీ నోట్ 11 (Redmi Note 11), రెడ్మీ నోట్ 11ఎస్ (Redmi Note 11S) స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. వీటిలో రెడ్మీ నోట్ 11ఎస్ గతేడాది రిలీజైన రెడ్మీ నోట్ 10ఎస్ స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ వర్షన్. రెడ్మీ నోట్ 11ఎస్ స్మార్ట్‌ఫోన్ సేల్ ఫిబ్రవరి 21 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. (image: Redmi India)
2. రెడ్మీ నోట్ 11ఎస్ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,499 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,499. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,499. హొరైజన్ బ్లూ, పోలార్ వైట్, స్పేస్ బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు. (image: Redmi India)
3. రెడ్మీ నోట్ 11ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డుతో కొంటే రూ.1,000 తగ్గింపు లభిస్తుంది. ఆఫర్‌తో 6జీబీ+64జీబీ వేరియంట్‌ను రూ.15,499 ధరకు, 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.16,499 ధరకు, 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.17,499 ధరకు సొంతం చేసుకోవచ్చు. అమెజాన్‌తో పాటు ఎంఐ ఆన్లైన్ స్టోర్, ఎంఐ హోమ్ స్టోర్, ఎంఐ స్టూడియో, రీటైల్ ఔట్‌లెట్స్‌లో కొనొచ్చు. (image: Redmi India)
4. రెడ్మీ నోట్ 11ఎస్ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.43 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమొలెడ్ డాట్ డిస్ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో జీ96 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ రియల్మీ 8ఐ, ఇన్ఫీనిక్స్ నోట్ 11ఎస్ లాంటి మోడల్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. (image: Redmi India)
5. రెడ్మీ నోట్ 11ఎస్ స్మార్ట్‌ఫోన్‌లో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. 108 మెగాపిక్సెల్ ప్రైమరీ Samsung HM2 సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో వెనుకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. (image: Redmi India)